Take a fresh look at your lifestyle.

రేపు రాష్ట్ర కేబినెట్‌ …నేడు బిఆర్‌ఎస్‌ ‌సమావేశం

తాజా పరిణామాలపై సీఎం కెసిఆర్‌ ‌చర్చ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16  :రేపు,గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు  అధ్యక్షతన.. డా. బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌తెలంగాణ సచివా లయంలో.. రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం జరగనున్నది. కర్ణాటక  ఎన్నికల ఫలి తాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతాయన్న ప్రచారం మధ్య బుధవారం బిఆర్‌ఎస్‌ ‌లెజిస్లేచర్‌, ఎం‌పిల సమావేశం జరుగ నుంది. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దశ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలు అంశాలను చర్చించనున్నారు.

నేతలను సన్నద్దం చేయడంతో పాటు తెలంగాణ విజయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా సిఎం కెసిఆర్‌ ‌శ్రేణులకు దిశానిర్దేశం చేయ నున్నారు. అయితే  అధికార పార్టీ టెన్షన్‌ ‌పడుతున్నట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ ‌సాధారణంగానే విమర్శలకు దిగింది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గట్టిపోటీ ఇస్తుందనే భావనకు వచ్చిన బీఆర్‌ఎస్‌.. ఆ ‌పార్టీ వ్యూహాలపై ఆపరేషన్‌ ‌కు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోందని చెబుతోంది.  ఇందులో భాగంగానే  అర్ధరాత్రి దాటాక బంజారాహిల్స్ ‌లోని యువజన కాంగ్రెస్‌ ‌సోషల్‌ ‌డియా ఆఫీసుపై సైబర్‌ ‌క్రై పోలీసులు దాడి చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక•, తెలంగాణ రాష్టాల్రకు వ్యూహకర్తగా సునీల్‌ ‌కనుగోలు ఉన్న విషయం తెలిసిందే. కనుగోలు టీం వ్యూహాలు.. హైదరాబాద్‌ ‌కేంద్రంగా సాగిన సోషల్‌ ‌డియా ఆపరే షన్లు కర్ణాటక•లో పార్టీని గెలిపించాయని కాంగ్రెస్‌ ‌నేతలే బహిరంగ ప్రకటనలు చేశారు. మరో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉండటం, ఇక్కడి వ్యూహకర్త కూడా సునీల్‌ ‌కనుగోలే కావడంతో అధికార బీఆర్‌ఎస్‌.. ఆ ‌పార్టీ స్టాటజ్రీ తెలుసుకునే పనిలో పడినట్టు సమాచారం.

Leave a Reply