కడప, మార్చి 28 : రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. పులివెందుల లో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు భరత్ తుపాకీతో ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు. భరత్ జరిపిన కాల్పుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తెలుగు దేశం పార్టీకి చెందిన దిలీప్, బాషాపై భరత్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో 4 రౌండ్లు కాల్పులకు పాల్పడ్డాడు. ఛాతీపై కాల్పులు జరపడంతో టీడీపీ కార్యకర్త దిలీప్ ప్రాణాలు వదిలాడు. మరోవైపు తీవ్రగాయాలతో బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బుల వ్యవహారంలో ఇరువురిపై భరత్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం.. పులివెందులలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం సపంలో భరత్ కుమార్ అనే యువకుడు.. మరో ఇద్దరిపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో దిలీప్, మహబూబ్ భాషాలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల శబ్దంతో స్థానికులు పరిగెత్తుకుని రావటంతో నిందితుడు భరత్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పులు జరిపిన భరత్ కుమార్ .. గాయపడిన దిలీప్ మధ్య కొన్నాళ్లుగా డబ్బుల వివాదం నడుస్తుందని.. ఈ క్రమంలోనే గొడవ జరిగిందని.. మాటా మాటా పెరిగి కాల్పుల వరకు వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టం అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోని తుపాకీ తీసుకొచ్చి మరీ కాల్చాడని.. భరత్ దగ్గర ఉన్న గన్ కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయంపైనా విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ ను.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలో విచారించారు. గాయపడిన దిలీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతన్ని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలిం