యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి

కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం
మెడలు వంచైనా కొనిపిస్తాం
దిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం
రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు…ధర్నాలు
పార్టీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధనం
ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నానాదాల హోరు
పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
బిజెపి మొండి వైఖరి విడనాడాలి : హైవే రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన టిఆర్‌ఎస్‌ ‌మంత్రి మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్యేలు

image.png
image.png
image.png
ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 6 : ‌వడ్లు కొనాల్సిందే అంటూ టిఆర్‌ఎస్‌ ‌చేపట్టిన ఆందోళన ఉధృతంగా సాగుతుంది. కెటిఆర్‌ ‌పిలుపులో భాగంగా బుధవారం టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు జాతీయ రహదారులపై బైఠాయించి ధర్నాలకు దిగారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినదించారు. వడ్ల్డు కొనాల్సిందే అంటూ నినాదాలు చేశారు. రహదారుల దిగ్బంధనంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు జిల్లాల్లో మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు శ్రీనివాస గౌడ్‌ ‌మహబూబ్‌నగర్‌లో, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి నిర్మల్‌లో ఇతర నేతలు ఆయా జిల్లాల్లో ధర్నాల్లో పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్‌ ‌చేస్తూ టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ధర్నాలకు దిగారు. పలు చోట్ల రహదారులపై నాయకులు బైఠాయించారు. నాగపూర్‌, ‌ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై నిరసన తెలుపాలని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ఆయా జాతీయ రహదారులు వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని, రాష్ట్ర రైతాంగం పక్షాన టీఆర్‌ఎస్‌ ‌ధర్మాగ్రహాన్ని ప్రకటించారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ‌సూర్యాపేట జిల్లాలో జగదీశ్‌రెడ్డి, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిర్మల్‌ ‌జిల్లా కడ్తాల్‌ ‌జంక్షన్‌ ‌వద్ద ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఇటు నల్లగొండ జిల్లా నకిరేకల్‌ ‌నేషనల్‌ ‌హైవే పై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌ ‌ధర్నా చేశారు. టీఆర్‌ఎస్‌ ‌నేతల ధర్నాతో మూడు కిలోవి•టర్లు ట్రాఫిక్‌ ‌జాం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ‌మండల కేంద్రంలో జాతీయ రహదారిపై టిఆర్‌ఎస్‌ ‌నాయకులు ధర్నాకు దిగారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌ ‌రెడ్డి, గొంగిడి సునీత పాల్గొన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రమే కొనాలన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు రైతు దీక్ష చేపట్టారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనకు దిగారు. రామాపురం క్రాస్‌ ‌రోడ్డు దగ్గర ధర్నా చేశారు. నిరసనలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ‌తో పాటు హుజూర్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే సైది రెడ్డి పాల్గొన్నారు.
బిజెపి మొండి వైఖరి విడనాడాలి : హైవే రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన టిఆర్‌ఎస్‌ ‌మంత్రి మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్యేలు
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనడం లేదని తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్నారని బిజెపి మొండివైఖరి నిరసిస్తూ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి ఇ తదితర ఎమ్మెల్యేలు బుధవారం జాతీయ రహదారిపై  ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను బేషరతుగా కేంద్ర ప్రభుత్వం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. పంజాబ్‌ ‌రాష్ట్రం తరహా తెలంగాణ లో పండించిన ధాన్యాన్ని కొనాలి అన్నారు కేంద్ర ప్రభుత్వం వన్‌ ‌తెలంగాణ పై దురుద్దేశంతోనే రైతులు పండించిన ధాన్యాన్ని కోరడం లేదని మంత్రి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి ఇ లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధ్వజమెత్తారు తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో దాదాపు 35 లక్షల ఎకరాలలో పంట పండే దని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సారథ్యంలో ప్రాజెక్టు రూపకల్పన చేశాక దాదాపు కోటి ఎకరాల పై పడి పంటలను రైతులు పండిస్తున్నారు అని దాదాపు 4 అంతలు పంట పెరిగిందని అది చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు తెలంగాణ లో లో ధర్నా లు తమకేమి కొత్తవి కాదని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కొనక పోతే ముందు మరింత పోరాటం చేస్తామని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ ‌యాదవ్‌ ‌షాద్నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ‌దేవరకద్ర ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇ సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం                      తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపుమేరకు బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని ముంబాయి జాతీయ దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యుడు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌ ‌రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం వారికి రైతుల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బిజెపి నాయకులు సైతం రైతుల పట్ల వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, గ్రామాల్లోని రైతులు బిజెపి నాయకుల బట్టలు విప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నాలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సత్తా చాటుతాం అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వరి వేయమన్న బిజెపి నాయకులు ఏరీ : జాతీయ రహదారిపై ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి
రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. బాజాప్తా వరి వేయండని, వి• వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయకులు తీరా పంట చేతికి వచ్చాకా మోహం చాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పండిన పంటను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ నాగపూర్‌ ‌జాతీయ రహదారిపై రైతులు, టీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రైతుల పక్షాన ధర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల తరపున టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇంత మండుటెండలో కూడా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల పక్షాన ధర్నా చేస్తున్నారని, ఇప్పటికైనా బీజేపీ సర్కార్‌ ‌బుద్ధి తెచ్చుకుని కళ్లు తెరవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page