యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మార్చి 31 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా తరలించనున్నట్లు ఆలయ ఈవో గీత గురువారం నాడు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం ప్రకటించింది.

ఉదయం 4-4.30 వరకు సుప్రభాతం, 4.30-5.00 వరకు బిందె తీర్థం, ఆరాధన, 5-530 : బాలభోగం, 5.30-6 వరకు పుష్పాలంకరణ సేవ, 6-7.30 వరకు సర్వదర్శనం, 7.30- 8.30 వరకు నిజాభిషేకం. 8.30- 9 వరకు సహస్రనామార్చన, 9-10 వరకు బ్రేక్‌ ‌దర్శనం, ఉదయం 10-11.45 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్ల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page