బొత్తిగా
రుచి కోల్పోయిన మనసుతో
ఆలోచనకు ఆకలిపోయింది.
ఇష్టానికి విలువివ్వని
లోపలి అభిమానం
బయట చలామణి కాలేక
ఇచ్చిన మనసును
పిచ్చినే అపారమైన
చులకనతో చిక్కిపోయి
ఆసారా లేని ఊహ
నిజమై ఆకారం దాల్చక
చప్పబడిపోతుంటే
ప్రతిరాత్రి మెడలోతు కలలో,
కలం పడవలో నిద్రను తెడ్డుగా
వేకువ దూరాన్ని
అనుమతి లేని తీరాలకు
ఆమెను ప్రాణం పోసుకున్నామని
చేతి వ్రాతలు
నలుగుతూ నడుపుతూ
ఇప్పుడెక్కడికి పోలేక
ఇప్పుడెవ్వరికి ఏమి కాలేక క్షమించమని
అనుకోని విధంగా రాలి
ఓడిన చోటకు
నీవు వచ్చి పోలేవు.
వస్తే నీ ఓటమితో
విజేత నేనేనని
ముందే తెలుసు నీకు.
– చందలూరి నారాయణరావు
9704437247