ముంబై, మార్చి 13 : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నీచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని ఎనిమిది్గ రిరజన్‌లతో మంటలను ఆర్పుతున్నారు. అయితే, గోదాంలో కేవలం ఫర్నీచర్ మాత్రమే ఉన్నదా.. సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఆ అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.