మారుతున్న వాతావరణం మానసిక ఆరోగ్యం

ఇప్పటికే కొరోనా వైరస్‌ ‌ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. మారుతున్న వాతావరణం కూడా మానసిక సమస్యలను పెంచుతాయని అమెరికన్‌ ‌సైకాలజికల్‌ అసోసియేషన్‌ ‌నిర్వహించిన సర్వే రిపోర్ట్ ‌తెలియచేయడం తో  ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక్కోసారి వాతావరణం లో చోటు చేసుకున్న మార్పులు కూడా ఒత్తిడి, రక్తపోటు, నిద్రలేమి, నిరాశకు కారణమవుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాదాపుగా 200 కు పైగా దేశాలల్లో ఆందోళన, నిరాశ, ఒత్తిడి, నిద్రలేమి తో సహా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఐక్యరాజ్యసమితిలో సైకాలజీ డే ఐక్యరాజ్యసమితిలో సైకాలజీ డే అనేది ప్రస్తుతం కోవిడ్‌-19 ‌పై ప్రపంచ దేశాలన్ని  యుద్ధం చేస్తున్న సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల పై మనస్తత్వశాస్త్రం ప్రాధాన్యతను సంతరించుకుంది.  మనస్తత్వవేత్తలతో, యుఎన్‌  ‌శాశ్వత మిషన్లు,  ఏజెన్సీలు, ఎంజీవో లు  మరియు ప్రైవేట్‌ ‌రంగాలతో సంభాషించడానికి ఇది ఒక వేదికగా సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది.  సైకాలజీ డే మానవ హక్కులను పరిరక్షించడంలో,  ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడంలో యూఎన్‌  ‌కార్యకలాపాలు మనస్తత్వవేత్తలను మరియు భవిష్యత్తు మనస్తత్వవేత్తలను ప్రోత్సాహకాలు అందించడానికి కృషి చేస్తుంది.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైకాలజీ దినోత్సవం 2007 లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల  ఆందోళన సమస్యలను పరిష్కరించే దిశగామనస్తత్వశాస్త్రం ను పూర్తి స్తాయి లో ఉపయోగించుకోవాలనే లక్ష్యం తో మనస్తత్వ శాస్త్రం పట్ల  అవగాహన కోసం మొట్టమొదటి  మనస్తత్వ శాస్త్ర దినోత్సవం నిర్వహించారు.
గతంలో నిర్వహించిన 13 మనస్తత్వ దినోత్సవం లలో ఐక్యరాజ్య సమితి ఎజెండాకు సంబంధించిన మనస్తత్వశాస్త్రంలోని సమస్యలపై దృష్టి సారించాయి. ఈ కార్యక్రమం యూఎన్‌  ‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక సైకాలజీ సంఘాలు తమ వంతు బాధ్యత గా పలు సూచనలు అందిస్తూ ఉన్నాయి., వీటిలో ప్రధానంగా  ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ అప్లైడ్‌ ‌సైకాలజీIAAP), ), ఇంటర్నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌సైకాలజిస్టస్ ICP),), ఇం‌టర్నేషనల్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌సైకలాజికల్‌ ‌సైన్స్ (IUPsyS), ),  సొసైటీ ఫర్‌ ‌ది సైకలాజికల్‌ ‌స్టడీ ఆఫ్‌ ‌సోషల్‌ ఇష్యూస్‌ ((SPSSI),), ఇన్స్టిట్యూట్‌ ‌ఫర్‌ ‌మల్టీ కల్చరల్‌ ‌కౌన్సెలింగ్‌ అం‌డ్‌ ఎడ్యుకేషన్‌ ‌సర్వీసెస్‌IMCES),),  మరియు అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌ట్రామా అవుట్‌ ‌రీచ్‌ • ‌ప్రివెన్షన్‌ ATOP)) ‌లు ఐక్య రాజ్య సమితితో కలసి పని చేస్తున్నాయి.సైకాలజీ విపత్కర పరిస్తితులను ఎదుర్కొంటుంది మనస్తత్వశాస్త్రం మానవ ప్రవర్తన గురించి తెలిపే శాస్త్రం మరియు  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడం సైకాలజి తెలియ చేస్తుంది.
విజయం, వైఫల్యం,  వైఖరి, మరియు రోజువారీ ప్రతిస్పందనలు మరియు వ్యక్తిగత నైపుణ్యం మొదలైన వాటిపై మనస్తత్వ శాస్త్రం వివరిస్తుంది. సమకాలీన మానసిక నైపుణ్యాలు నేర్చుకోవడం చురుకుదనం • అనుకూలత మొదలైన అంశాలను మనుషులను ప్రభావితం చేస్తాయి. మానసిక శాస్త్రం అనుభావిక విశ్లేషణ ఆధారంగా మెరుగైన ప్రవర్తనా నమూనాలను రూపొందించడం, వ్యక్తిగత మరియు గృహ ప్రవర్తనపై లోతైన అవగాహనను అందించడం మరియు జోక్యాలను అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలకు మూల్యాంకన పరిశోధన పద్ధతులను వర్తింపజేయడం ద్వారా వాతావరణ మార్పులను నడిపించే ప్రవర్తనల అవగాహనను మెరుగుపరుస్తుంది.
పరిస్తితులను అంచనా
వాతావరణం లో మార్పులు సహాజం. తుఫాన్‌ ‌లు, విపరీతమైన ఎండలు, అతి వృష్టి, అనా వృష్టి లు ఏర్పడినపుడు ఆర్థికంగా సామాజికంగా అనుకోని పరిస్థితులు ఎదురవుతాయనే విషయాన్ని ముందుగానే గుర్తించండి. మానసిక దైర్యాన్ని పెంపొందించుకోవాలి. కేవలం ఆందోళనే మాత్రమే భయపెడుతోందని తెలుసుకోవాలి. అది కేవలం మీ ఆలోచన మాత్రమే. మీరు అనుకున్నవన్నీ నిజమవుతాయని ఊహించుకోవద్దు . మీ ఆలోచనలు అన్నీనిజాలు కావని గ్రహింఛాలి. విపత్కర పరిస్థితిని గుర్తించిన వెంటనే స్పందించకండి. ఒక్క క్షణం ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. 2 నుండి 3 నిమిషాల పాటు పరిస్తితి అంచనా, అవగాహన చేసుకొన్న తదుపరి స్పందించాలి.
image.png
డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి,
 రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ , 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page