మరో హైటెక్‌ ‌సిటిగా మహేశ్వరం

  • ఈ ప్రాంతానికి త్వరలో మెట్రోరైలు
  • విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 28: ‌మహేశ్వరం మరో హైటెక్‌ ‌సిటీగా మారబోతుందని ఈ ప్రాంతానికి పరిశ్రమలు, మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో బి.ఆర్‌.ఎస్‌‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హజరై మండల పార్టీ కార్యాలయాని మంత్రి ప్రారంభించారు.బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గారు మహేశ్వరం నియోజకవర్గానికి సేవ చేయటానికి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించారని,అందరూ ఆశీర్వదించాలని కోరుకున్నారు.సబితమ్మ వెనుక ఉన్న బలగాన్ని చూసి మహేశ్వరం సీటు కోసం ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో చర్చిస్తున్నారు అంటేనే మన కార్యకర్తల,నాయకుల బలం తెలుస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్‌ ‌ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూరిందని,పార్టీలకతీతంగా సంక్షేమం కార్యక్రమాలు అందాయని పేర్కొన్నారు.30 రోజులు నా కోసం పని చేయండి ఆ తర్వాత మీ కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని అన్నారు.

119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ‌పోటీ చేస్తున్నారని భావించి ఓటు వేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని ఆ దిశగా ప్రతి నాయకుడు కార్యకర్త ముందుకు సాగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌రే కాబోతున్నారని,17 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందిస్తామన్నారు.రైతు భీమా లాగా 93 లక్షల కుటుంబాలకు భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.మహిళలకు 3 వేలు అందించనున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతులకు ఎకరాకు 10 వేలు,24 గంటల విద్యుత్‌,‌కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్‌ ‌పథకాలు,ఆసరా పెన్షన్లు ఇస్తుంటే రైతు బంధు అపామని కాంగ్రెస్‌ ‌నాయకులు పిర్యాదు చేసారని, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రైతులకు 3 గంటల విద్యుత్‌ ‌చాలని మరొక నేత పేర్కొన్నారన్నారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.సి ఎం కేసీఆర్‌ ‌వస్తేనే మన ప్రాంతం అభివృద్ది చేడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్‌ ‌పర్సన్‌ ‌తీగల అనితారెడ్డి,ఎమ్‌ ‌పీపీ సునీత అంధ్యా నాయక్‌,‌మండల పార్టీ అద్యక్షుడు రాజు నాయక్‌, ‌నాయకులు గుండెమోని అంజయ్య ముధిరాజ్‌, ‌మల్లేష్‌ ‌యాదవ్‌, ‌పి అంబయ్య యాదవ్‌, ‌కర్నాటి మనోహర్‌,‌కర్రోళ్ల చంద్రయ్య, కంది రమేష్‌, ‌కూన యాదయ్య, హెచ్‌ ‌చంద్రయ్య,కరుణాకర్‌ ‌రెడ్డి,ఎం నవీన్‌,‌సుధీర్‌ ‌గౌడ్‌, ‌సుధాకర్‌ ‌రెడ్డి, పాండు యాదవ్‌, ఆదిల్‌ అలీ, ఎం ఎ సమీర్‌, ‌దోమ శ్రీనివాస్‌ ‌రెడ్డి, కడమోని ప్రభాకర్‌, ‌గోపాల్‌ ‌నాయక్‌,‌సర్పంచ్‌ ‌లు, ఎం పి టి సి లు తధితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *