‌మరో వివాదంలో అదానీ గ్రూపు

చం ఇవ్వజూపారని అమెరికాలో కేసు
ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూపు
భారీగా పడిపోయిన అదానీ గ్రూప్‌ ‌షేర్లు

న్యూయార్క్,‌నవంబర్‌21: అదానీ గ్రూపు మరో వివాదంలో ఇరుక్కుంది. అది కూడా లంచం కేసు కావడం విశేషం. భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ ‌సంస్థ ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీపై లంచం కేసు నమోదయ్యింది. ఈ మేరకు  అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడమే గాక.. దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్ ‌ఫెడరల్‌ ‌ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్‌ ‌డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ ‌డాలర్లు లంచాలు ఆఫర్‌ ‌చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అనంతరం అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ యత్నించినట్లు పేర్కొంది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ ‌డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ‌ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇదే సమయంలో సెక్యూరిటీస్‌ అం‌డ్‌ ఎక్స్ఛేంజ్‌ ‌కమిషన్‌ ‌మరో సివిల్‌ ‌కేసు నమోదు చేసింది. యూఎస్‌ ‌సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ ‌డాలర్లకు పైగా సవిరీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్‌ ‌కోరింది. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌ ‌స్పందించింది. సోలార్‌ ‌పవర్‌ ‌కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వొచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నా మని పేర్కొంది. సోలార్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు రూ.2,100 కోట్లు భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలతో పాటు, దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.

గౌతమ్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోద్కెనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అదానీ గ్రూపు స్టాక్స్ ‌భారీగా పడ్డాయి.  ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్‌, ‌భాజపాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. అదానీ గ్రూపుపై పెద్దఎత్తున ఆరోపణలు రావడంపై ఆ గ్రూపు స్పందించింది. అవి కేవలం నేరారోపణలు మాత్రమేనని అదానీ గ్రూపు ప్రతినిధి పేర్కొన్నారు. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందన్నారు. పాలనా వ్యవహారాల్లో, పారదర్శకత విషయంలో అదానీ గ్రూపు ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందన్నారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతిచోటా వీటిని పాటిస్తూ వస్తున్నామన్నారు. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page