సమస్యలపై బండి సంజయ్‌కి వినతి పత్రం అందచేసిన గంగపుత్రులు
మౌలాలీలో ప్రజాసంగ్రామ యాత్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: వాజ్ పేయి కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్టి జాబితాలో చేర్చాలని కోరారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు గంగపుత్రులు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భవిష్యత్‌పై భరోసాను ఇస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం మౌలాలికి చేరుకుంది. ఈ సందర్భంగా మౌలాలిలోని మనీషా గార్డెన్స్‌లో గంగపుత్రులు ఆయనను కలిశారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. కులవృత్తులను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందని బండి సంజయ్‌తో గంగపుత్రులు అన్నారు. గంగపుత్రుల పొట్ట కొట్టేందుకు కేసీఆర్ సర్కార్ జీవో నంబర్ 6ను తెచ్చిందన్నారు.
జీవో నెంబర్ 6ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. చేపలు పట్టే వృత్తి గంగపుత్రులకే హక్కుగా ఉండాలన్నారు. గంగపుత్రులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని బండి సంజయ్ ఈ సందర్భంగా గంగపుత్రులకు హావి• ఇచ్చారు. అన్ని కులాలు, అన్ని వర్గాలలోని అర్హులకు బీజేపీ తప్పక న్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ‘గౌడ్ శెట్టి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్’ ప్రతినిధుల బృందం కలిసింది.
తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించింది. ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత..2014లో జీవో నెంబర్ 3 ప్రకారం శెట్టి బలిజ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించి కేసీఆర్ సర్కారు అన్యాయం చేసిందన్నారు. మమ్మల్ని వి•రే ఆదుకోవాలని అసోసియేషన్ బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కులాన్ని బీసీ జాబితాలో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గౌడ్ శెట్టిబలిజ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం కోరింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని బండి సంజయ్ చెప్పారు.



