‘‘మత్తు మందు ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసైతే అది చంపే దాకా వదిలి పెట్టదు. అంతేకాదు ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికీ ప్రమాదమే. కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది.’’
గంజాయితో స్కిజోఫ్రెనియా, మానసిక స్థితి అధ్వాన్నం
సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా యువకులను మత్తులో ముంచుతున్న గంజాయి ముఠాలు. మత్తుకు బానిసగా మారిన యువతను ఏజెంట్లుగా మార్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. గంజాయి, బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే, బానిసైన యువత భవిష్యతును చిత్తు చేస్తోంది. తమ అక్రమ సంపాదన కోసం మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాల, కళాశాలల విద్యార్ధులకు గంజాయికి అలవాటు చేసి కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. గ్రామాల్లోని పాఠశాల విద్యార్ధులు, కాలేజ్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడటంతో లేత వయసులోనే విద్యార్దుల జీవితాలు చిక్కి శల్యమైపోతున్నాయి. మాదక ద్రవ్యాలు శారీరక, మాన సిక రుగ్మత లను కలిగించ డమే కాక, నైతిక విలువ లను దిగజారు స్తున్నాయి.
మనలోని నమ్మకం, ఆనందమే మన సమాజంలో స్థితిని నిర్ణయిస్తాయి. అయితే ఆ ఆనందాన్నిఏ విధంగా సంపాదించుకుంటామన్నదే ముఖ్యం. మాదక ద్రవ్యాలు తీసుకుని, తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడితే ఆనందం, ఆరోగ్యం రెండూ దూరమవుతాయి.
ఒక్కసారి అలవాటైతే… చంపే దాకా వదలదు..
మత్తు మందు ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసైతే అది చంపే దాకా వదిలి పెట్టదు. అంతేకాదు ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికీ ప్రమాదమే. కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలికగా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది.
మాదక ద్రవ్యాలతో జీవితమంతా నరకమే
సంతాన ప్రాప్తికి దూరం (infertility)
గంజాయి సేవించే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గి పోయి వారు తండ్రులు కాలేక పోవడం, స్త్రీలలో అండాలు తగ్గి, వారు గర్భవతులు కాలేక పోవడం కూడా జరుగుతుంది. బాగా గంజాయి పీల్చే స్త్రీలు గర్భవతులవుతే, వారికి కలగ బోయే శిశువులు అవయవ లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది.
గంజాయి స్కిజోఫ్రీనియా కి కారకం
గంజాయి పీల్చే వారి మానసిక స్థితి క్రమేణా అధ్వాన్నం అవుతుంది. వారు తరచూ, మనుషులు లేని చోట మనుషులను చూడడం, మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను, శూన్యం లో శబ్దాలను వింటున్నట్లుగా జరుగుతుంది. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు హాని తలపెట్టే ఉద్దేశం లో ఉన్నారని భావిస్తూ ఉంటారు. మెదడు పనితీరు మందగిస్తుంది.
మార్పులు గమనించాలి..మార్పు తీసుకురావాలి
యుక్త వయస్సుకు చేరుకుంటున్న తమ పిల్లల్లో వస్తున్న మార్పులను గురించి ప్రధానంగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. యువత పెడదోవ పట్టడానికి సమాజంలోని ఏదో ఒక వ్యక్తి గానీ, ఏదో ఒక సంఘటన గానీ కారణంగా ఉండవచ్చు. జీవితం గురించి పూర్తి అవగాహన కల్పించడం వంటివి చేయడం వల్ల చీకటి కోణం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
– డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్