సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: వైద్య, ఆరోగ్య శాఖ నూతన మంత్రిగా దామోదర రాజనర్సింహ సచివాలయంలోని తన ఛాంబర్ లో గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సంప్రదాయ బద్దంగా పూజలు చేసి ఫైల్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆందోల్ మండల నాయకులు దామోదర రాజనర్సింహ ను ఘనంగా సన్మానించి మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరాక మా ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతామని ఆందోల్ మండల మాజీ సీడీసీ డైరెక్టర్ మక్త జగన్మోహన్ రెడ్డి, నేరడిగుంట గ్రామ సర్పంచ్ చందులత వీరమల్లప్ప బిల్డర్ పట్లోళ్ల రాజు పటేల్ లు పెన్ గన్ రిపోర్టు తో అన్నారు. ఎలాగైనా మంత్రితో నేరడిగుంట గ్రామాన్ని మండల కేంద్రంగా చేయలని లేని పక్షంలో ఆరోగ్య కేంద్రం మరియు జూనియర్ కాలేజ్ మంజూర్ చూపించి గ్రామ ప్రజల హృదయాల్లో చిర స్తాయిగా పేరు సంపాదించుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.




