లక్నో, మార్చి 28 : భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో భోజ్ పురి గాయకుడు సమర్ సింగ్, అతని సోదరుడిపై హత్య కేసు నమోదైంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 25ఏళ్ల ఆకాంక్ష దుబే మార్చి 28న వారణాసిలోని ఓ హోటల్ మార్చి 26న ఆత్మహత్య చేసుకుంది. ఓ సాంగ్ షూటింగ్ కోసం వారణాసికి వెళ్లిన దుబే.. ఓ హోటల్ లో బస చేసింది. షూటింగ్ అనంతరం హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆకాంక్ష తల్లి మధు దుబే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సింగర్ సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ పై కేసు నమోదు చేశారు.
ఆకాంక్ష హత్య కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని సారనాథ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.వో ధర్మపాల్ సింగ్ తెలిపారు. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యగా అనుమానిస్తున్నామన్నారు. ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాకు చెందిన దూబే ’కసమ్ పైడా కర్నే వాలే కి 2’, ’ముజ్సే షాదీ కరోగి’
(భోజ్‌పురి) , ’వీరోన్ కే వీర్’ వంటి అనేక ప్రాంతీయ చిత్రాలలో నటించారు.