గెటిస్తే యాదాద్రిలా భదాద్రి రామాలయం అభివృద్ధి
భద్రాచలం వరద నివారణకు శాశ్వత పరిష్కారం
గత రెండు ఎన్నికల్లో ఇక్కడ మేము గెలవలేదు…అందుకే గ్యాప్ వొచ్చింది
గాడిదకు గడ్డివేస్తే…ఆవు పాలు ఇవ్వదు
మమ్మల్ని నమ్మండి…కారుకు వోటు వేయండి
భద్రాచలం రోడ్‌షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు
భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్• 19 : గతంలో రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించకపోవడంవలనే కొంత అభివృద్ది జరగలేదని, గ్యాప్ రావడం వాస్తవమేనని ఈసారైనా బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావును గెలిపించడం వలన భద్రాచలం అభివృద్ధి జరుగుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు అన్నారు. ఆదివారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ…రాములవారిని దర్శించుకోలేదని కొంతమంది విమర్శిస్తున్నారని, తెల్లం వెంకట్రావును గెలిపించిన వారం రోజుల్లోనే రాములవారిని దర్శించుకోవడానికి వొస్తానని తలిపారు. ఎన్నికల కోడ్ ఉండటం వలన ఇప్పుడు దర్శించుకోలేకపోయానని అన్నారు. భదాద్రి రామయ్యను తాము చిన్నచూపు చూసామని కొంతమంది ప్రతిపక్షనాయకులు పనికట్టుకుని కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని, అటువంటి వారికి ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ను గెలిపించి గట్టిగా బుద్దిచెప్పాలని కోరారు. తాము రాములవారిని ఏనాడు చిన్నచూపు చూడలేదని, తన పేరులోనే తారకరామారావు ఉన్నదని అప్పటిలోనే తన తల్లిదండ్రులు రాములవారిపై భక్తి ఉండటం వలనే తనకు రామారావు అని పేరు పెట్టారని గుర్తు చేసారు. భద్రాచలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా ఆదివాసీల కోసం 16 వేల ఎకరాలకు పోడుపట్టాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించడం వలన భద్రాచలం ఏమాత్రం అభివృద్ధి జరగదని తెలిపారు. గాడిదకు గడ్డి వేస్తే ఆవు పాలుఇవ్వదని, కాంగ్రెస్‌కు వోటువేసి తమను అభివృద్ధి చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం భద్రాచలం ప్రజలను శాస్వత వరద నివారణ చేసేందుకు 38 కోట్లతో కరకట్ట నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
తాము భద్రాచలంను నిర్లక్ష్యం చేయలేదని, అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు డాక్టర్ తెల్లం వెంట్రావును గెలిపించాలని కోరారు. భద్రాచలంను మూడు పంచాయితీలుగా విడకొట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయం కాదని, ఇక్కడ ప్రజలు ఒక పంచాయితీగా కావాలని నిర్ణయుస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా భద్రాచలంను మున్సిపాల్టీగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో అన్ని గూడాలను, తండాలను పంచాయితీలుగా తీర్చిదిద్దామని కెటిఆర్ గుర్తు చేసారు. చర్ల మండలంలో బిఇడీ కాలేజ్ కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిశంబర్ 3 తరువాత మహిళలకు 3 వేల రూపాయలు సౌభాగ్యలక్ష్మీ పేరుతో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే బిజేపి ప్రభుత్వం 12 వందల రూపాయలకు గ్యాస్ ఇస్తుందని, మళ్ళీ 8 వందలకు తగ్గించిందని అన్నారు. తమ ప్రభుత్వంను మూడవసారి గెలిపిస్తే నాలుగు వందలు తాము భరించి ప్రజలకు 4 వందలకే గ్యాస్ ఇస్తామని తెలిపారు. ఆసరా పెన్స్న్ 5 వేలు రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. రైతుబంధు ద్వారా ఎకరానికి 16 వేల రూపాయల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. భద్రాచలంపై కేసీఆర్‌కు ప్రేమ ఉండటంవలనే భదాద్రి కొత్తగూడెం అని పేరుపెట్టడం జరిగిందని తెలిపారు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని, భద్రాచలంలో కరెంట్ కష్టాలు చూసామని గుర్తుచేసారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువొచ్చిందని, మళ్లీ అధికారంలోకి వొచ్చాక ప్రతీ మండలంలో కోల్డ్‌స్టోరేజీలు నిర్మిస్తామని అన్నారు. ఈ రోడ్‌షోలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదనరావు, భద్రాచలం నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ తెల్లం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, తదిత నాయకులు పాల్గొన్నారు.
రాములవారి దర్శనానికి వెళ్ళకుండానే పట్టణంలో పర్యటన : స్థానికుల అసహనం
సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి దర్శనాన్ని వొచ్చేందుకు కల్వకుంట్ల కుటుంబం వెనకడుగు వేస్తుంది. ఆదివారం కేటీ రామారావు భదాద్రి పట్టణంలోని పలు ప్రధాన రహదారుల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. అయితే భదాద్రికి వొచ్చి ఆ రామయ్యను దర్శించుకునే తీరిక లేదా అని రామభక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భదాద్రి ఆలయ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రకటనలు విడుదల చేస్తూనే మరోవైపు భదాద్రికి వొచ్చి రాముల వారిని దర్శించకపోవడం ఏంటని వారు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో తన తండ్రి కెసిఆర్ అవలంబిస్తున్న తీరుని తనయుడు కేటీఆర్ కూడా అవలంబిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేటీఆర్ తన పర్యటనలో భాగంగా అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో భదాద్రి ఆలయ అభివృద్ధిపై ప్రస్తావించడం కొసమెరుపు.