- కృష్ణా జల వివాదాల విచారణపై కీలక తీర్పు
- అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌పై మొదట విచారణ చేయాలని ట్రైబ్యునల్ నిర్ణయం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16 : రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అం శానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ విజయం సాధిం చింది. ఈ మేరకు ఏపీ వాదను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. తెలంగాణ రాష్ట్ర వినతి మేరకు తొలుత రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై విచారణ చేస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్పటికీ. దానిని బ్రిజేష్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. జలాల పంపిణీ అంశానికి సంబంధించి ట్రిబ్యునల్‌ను ఏపీ ప్రభుత్వం ఒప్పిం చలేకపోయింది. 811 టీఎంసీలలో ఏపీ, తెలంగాణలకు ఎంత కేటాయించాలనే అంశంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ జరపనుంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి సంబంధించిన అంశం తొలుత వినడం సముచితమన్న ట్రిబ్యు నల్.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు ముందే ఈ విషయంపై నిర్ణయం అవసరమని పేర్కొంది.
సెక్షన్%-%3 ప్రకారం కృష్ణా జలాల అంశాన్ని విచా రిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. సెక్షన్ 89, సెక్షన్-3 రెండిరటి ప్రకారం విచారించాలని తెలంగాణ కోరగా, ఏపీ ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సెక్షన్‌లు వేర్వేరుని, సెక్షన్-3పై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున సెక్షన్ 89పై విచారించాలని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెక్షన్-3 ప్రకారమే తొలుత వాదనలు వినాలని స్పష్టం చేసింది. తెలంగాణ వినతిని సమ్మతిస్తూ సెక్షన్-3 ప్రకారం తొలుత వాదనలు వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీలలో మెజారిటీ వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి పంపిణీ ఒప్పందాన్ని ఒప్పుకోమని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. దాంతో విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21 వరకూ తిరిగి ఇరు రాష్ట్రాల వాదనలు తిరిగి ట్రిబ్యునల్ విన నుంది. కాగా, కృష్ణ నీటి పంపకాలపై ఈరోజు వాదనలు జరిగాయి. రెండు రోజుల పాటు వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ అనూహ్యంగా ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. తెలంగాణకు నీటి కేటా యింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్న సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇటీవల నీటి పారుదల శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులతో సైతం చర్చించారు.