ఇక్కడ ‘‘బుల్డోజర్’’ అంటే
కేవలం కట్టడాలను కూల్చే
శకటం మాత్రమే కాదు సుమీ
జన జీవన సౌదాల్ని
నేలమట్టం గావిస్తున్న
విధ్వంసకర వాహనం
మనిషి మూలల్ని పెరికి
నిరాశ్రయులుగా చేస్తున్న
కరడు మృత్యు యంత్రం
మత విద్వేషం రెచ్చగొట్టి
భారతజాతిని విడగొట్టి
పడగొట్టేటి ఉన్మాద రథం
దేశ సమస్త వ్యవస్థలను
విచ్చీన్న పర్చే ఉగ్ర భూతం
ఇపుడు దేశ రాజధాని ఢిల్లీ
జహంగీర్పూరీ అభాగ్యులు
నిరుపేదలపై విరుచుకుపడి
భీకర విధ్వంసం సృష్టిస్తుంది
జీవనాదరువుల కూల్చేస్తుంది
ఇందుకు కొనసాగింపుగా
రేపు మన పైకి దూసుకొచ్చి
రక్తపాతం సృష్టించక పోదు
అందుకే ఇప్పటికైనా
అందరం సంఘటితమై
దుష్ట చేష్టల నిలువరిద్దాం
విధ్వంసకాండ సాగిస్తున్న
బుల్డోజర్లను పాతరవేద్దాం
విద్వేష విషం చిమ్ముతున్న
మతోన్మాదుల్ని తరిమేద్దాం
భారతదేశం సమైక్య జీవన
శాంతి క్షేత్రమని నిరూపిద్దాం
(ఢిల్లీ జహింగీర్ పూరీలో బుల్డోజర్ విధ్వంసకాండకు నిరసనగా..)
– కోడిగూటి తిరుపతి:
9573929493