ప్రజాతంత్ర, హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సమావేశాల ప్రారంభం రోజు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేశారు.
అయితే, స్పీకర్ ఏకపక్షంగా సస్పెండ్ చేసి తమ సభాహక్కులకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఆదేశాలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై రెండు రోజుల పాటు విచారణ నిర్వహించిన హైకోర్టు శుక్రవారం స్పీకర్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.