బిజెపి అధికారంలోకి వొస్తే బిసి సిఎం..

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చని బిఆర్‌ఎస్‌
‌నీళ్లు, నిధులు, నియామకాలపై మోసం
బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నాణానికి బొమ్మాబొరుసు
లిక్కర్‌ అవినీతిలో ఎవరినీ వొదిలి పెట్టేది లేదు
పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని రాష్ట్ట్ర ప్రభుత్వం
అవినీతి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం
పేదలకు మరో పదేళ్లు ఉచిత రేషన్‌
‌హైదరాబాద్‌ ‌బిసి ఆత్మగౌరవ సభలో మోదీ

హైదరాబాద్‌, ‌హైదరాబాద్‌, ‌నవంబర్‌ 7 : ‌తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వొస్తే బీసీని సీఎం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వొచ్చిందని, అట్లాంటి నీళ్లు, నిధులు, నియామకాలపై బిఆర్‌ఎస్‌  ‌మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని ప్రధాని గుర్తు చేశారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ ‌నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ ‌నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తామని మోదీ హెచ్చరించారు. బీసీల ఆకాంక్షలను బిఆర్‌ఎస్‌ ఎప్పు‌డూ పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణలో వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, యువతను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ‌వెళ్లిపోవాలా, వద్దా అని మోదీ ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాను ప్రధాని అయ్యానని, తాను ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అయ్యిందని, అదే సంకల్పంతో తెలంగాణకు బీసీ సీఎం అవుతారని అన్నారు. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారని, తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారన్నారు. 9 ఏళ్లుగా విరోధి అధికారంలో ఉన్నారుని మోదీ అన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్‌ ‌కనిపిస్త్తుందన్నారు. తెలంగాణ సర్కార్‌ ‌బీసీలను పట్టించుకోవడం లేదని, బీఆర్‌ఎస్‌కు తన కుటుంబమే ప్రాధాన్యమని, కాంగ్రెస్‌ ‌పార్టీకి సీ టీమ్‌ ‌బీఆర్‌ఎస్‌ అని, బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌రెండు పార్టీల డిఎన్‌ఎ ఒక్కటేనని అన్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు వారి లక్షణాలని, బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేనని, బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది కూడా బీజేపీనేనని అన్నారు.

ఇక్కడి నేతలు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో ఇక్కడి నేతలకు సంబంధం ఉందని, విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలను తిడుతున్నారని, జనాన్ని దోచుకున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సిదేనని, రాష్ట్రాన్ని దోచుకోవాలన్నదే బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌లక్ష్యమన్నారు. వారి పిల్లలకు దోచిపెట్టడమే వాళ్ల పని అని, వారి పిల్లల భవిష్యత్‌ ‌వారికి ఏ మాత్రం పట్టదన్నారు. ఒక తరం భవిష్యత్‌ను దోఖా ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. అబ్దుల్‌ ‌కలామ్‌ను వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారు. పీఏ సంగ్మా, బాలయోగిని స్పీకర్‌ ‌చేసింది బీజేపీనే. రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది బీజేపీనే. గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసింది బీజేపీనే. ఓబీసీని అయిన నన్ను ప్రధానిని చేసింది బీజేపీనే. మెడికల్‌, ‌డెంటల్‌ ‌కాలేజీల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్‌ ‌కల్పించామని మోదీ తెలిపారు. డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న మాట గాలిమూటగా మారిపోయిందని, దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో బీఆర్‌ఎస్‌ ‌నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ ‌నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని, అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం అతి పెద్ద మోసం బీసీలకు చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడూ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

దళితులు, పీడితులు, ఆదివాసీలకు ఎప్పుడూ బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. ‘అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయీ ప్రభుత్వం సమయంలో మేమే ఏపీజే అబ్దుల్‌ ‌కలాంను రాష్ట్రపతిని చేశాం. జీఎంసీ బాలయోగిని బీజేపీ తొలి దళిత లోక్‌ ‌సభ స్పీకర్‌ ‌ను చేసిందని గుర్తు చేశారు. అలాగే తొలి దళిత రాష్ట్రపతిగా కూడా రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ను చేసిందని, అలాగే ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి తొలి ఆదివాసీ వ్యక్తిని దేశాధినేత చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నారన్నారు. మోదీ తన ప్రసంగంలో తరచుగా నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రజలను సంభోదించారు. అహంకారం ఉన్నవారికి ప్రజలు వోట్లు వేయరు. బీఆర్‌ఎస్‌ ‌నేతల్లోనూ అలాంటి అహంకారం కనిపిస్తుంది. అవినీతి ప్రభుత్వాన్ని ఈసారి ఇంటికి పంపడం ఖాయం. 2019 లోక్‌ ‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అలాంటి అహంకార సీఎంకు వి• ఓటుతో జవాబు ఇచ్చారు. ఇక్కడి నేతలు మోదీని తిడుతూ ఉంటారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌వేరు వేరు కాదు. ఒకే నాణెళినికి ఉన్న రెండు ముఖాలు. బీఆర్‌ఎస్‌ ‌నేతలకు ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ కేసును సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుంటే ఆ సంస్థలను ఇక్కడి నేతలు తిడుతున్నారు. వేల సంఖ్యలో టీచర్‌ ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తెలంగాణ యువత జీవితాన్ని బీఆర్‌ఎస్‌ ‌సర్కారు నాశనం చేస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ యువకుల జీవితాలను నాశనం చేస్తోంది. అన్ని నియామక పరీక్షల్లో అవకతవకలు కామన్‌ అయిపోయాయన్నారు. పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నాం. మరో ఐదేళ్ల పాటు ఫ్రీగా బియ్యం ఇవ్వడాన్ని పొడిగిస్తున్నాం. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ. తెలంగాణలో డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌కావాల్సిందే. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ప్రధాని మోదీ అన్నారు.  రాష్ట్రంలో టెన్త్ ‌పేపర్‌ ‌లీకేజీ, టీఎస్‌ ‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల పేపర్లు సైతం లీకయ్యాయని, అందుకు బీఆర్‌ఎస్‌ ‌చేతకానితనమే కారణమంటూ మండిపడ్డారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలను బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం గాలికొదిలేసిం దన్నారు. అహంకారం ఉన్నవారికి ప్రజలు ఓట్లు వేయరని, కానీ బీఆర్‌ఎస్‌ ‌నేతల్లోనూ అలాంటి అహంకారం కనిపిస్తుందన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఈసారి ఇంటికి పంపడం ఖాయమని, బీఆర్‌ఎస్‌ ఓటమి తథ్యమన్నారు. 2019 లోక్‌ ‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అలాంటి అహంకార సీఎంకు వి• ఓటుతో జవాబు ఇచ్చారు. ఇక్కడి నేతలు మోదీని తిడుతూ ఉంటారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌వేరు వేరు కాదు. ఒకే నాణెనికి ఉన్న రెండు ముఖాలు అని ప్రజలు గుర్తించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *