కనుమరుగైందన్న కొరోనా
మరోమారు విజృంభిస్తుంది
కడతేరిందన్న వేరియంట్
మళ్ళీ జడలు విప్పుతుంది
తేలికైందన్న వైరస్ వేవ్
మరింత విషం కక్కుతుంది
తలొగ్గిందన్న మహమ్మారి
మలి పోరుకు తెగబడ్తుంది
ఇప్పటికే ఉత్పాతం రేపి
లక్షల ప్రాణాలు కబళించి
ఇంకా రక్త దాహం తీరనట్లు
ఎప్పటికపుడు వేషం మార్చి
మానవ హననం గావిస్తుంది
ఇందుకు రోజు పెరుగుతున్న
కోవిద్ కేసులే ప్రత్యక్ష సాక్ష్యం
పాలకుల నిర్లక్ష్యానికి తోడు
మన ఉదాసీన వైఖరి కూడా
ఈ ముప్పుకు మూలం సుమీ
ఇపుడు ప్రభువుల ద్వేషిస్తేనే
మహమ్మారి ముప్పు తప్పదు
కనిపించని దేవుణ్ణి ప్రార్థిస్తేనే
కోరోనా గండం గట్టెక్కించడు
అందుకే…ఈసారి
రెట్టింపు జాగ్రత్త వహిస్తే
మాస్క్ దివ్యాస్త్రం ధరిస్తే
ఆరోగ్య సూత్రాలు ఆచరిస్తే
సామాజిక దూరాలు పాటిస్తే
టీకా యజ్ఞం సంపూర్తి చేస్తేనే
కోరోనా శాశ్వతంగా కడతేరేను
ఆరోగ్య ‘‘భారతం’’అవతరిచేను
(కోరోనా అంతానికి ప్రజా
మేలుకొలుపుగా..)
– కోడిగూటి తిరుపతి:9573929493