ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని హోమ్‌ గార్డుల వినతి
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : శుక్రవారం ప్రజాభవన్‌లో చేపట్టిన  ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెలువెత్తాయి. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేం దుకు రాష్ట్ర సర్కార్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివొచ్చారు. పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగా లు ఇప్పించాలని పెద్ద ఎత్తున వచ్చిన జనాలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. హోమ్‌ గార్డులకు సంబధించి 250 మంది తమ సమస్యను ప్రజాభవన్‌లో అధికారులకు విన్నవించుకునేందుకు వొచ్చారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 250 మంది హోంగార్డులు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు విధులు నిర్వహించిన తర్వాత.. తమకు ఆర్డర్‌ కాపీ లేదని 2011లో తీసేశారని, 2014లో తెలంగాణ రాష్ట్రం వొచ్చాక తమకు న్యాయం చేయాలని తిరగ్గా.. తిరగ్గా 2018లో మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హావిరీ ఇచ్చారని, ఆ హావిరీ నెరవేరలేదని అన్నారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వొస్తే అందరినీ ఆదుకుంటామని గతంలో మాకు రేవంత్‌ రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క హావిరీ ఇచ్చారని.. ఇప్పుడు తమను విధుల్లోకి తీసుకుంటారనే నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వొచ్చామని హోమ్‌ గార్డులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *