బిఆర్‌ఎస్ వెడ్స్ బిజెపి వినూత్నంగా పెళ్లి కార్డు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టో
తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే అనే ప్రచారాన్ని మరింత వినూత్నంగా ముందుకు తీసుకువెళ్తోంది. ’ప్రేమలో బీఆర్‌ఎస్ – బీజేపీ’ అంటూ వెడ్డింగ్ కార్డులను ముద్రించి పంచుతూ ఉంది. కార్డు లోపల లగ్గం వేడుక అని.. రాజకీయ బాగోతమేసే వారి ఇంట ఉంటుందని ప్రచురించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో లగ్గం ఉంటుందని ఎద్దేవా చేస్తూ ప్రచురించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లగ్గం పిలుపు.. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో.. ముహూర్తం 2023 సార్వత్రిక ఎన్నికల్లో.. బీఆర్‌ఎస్, బీజేపీల పెండ్లి, నక్షత్రం: కవితపై కరుణ నక్షత్రంలో, పిలిశెటోళ్లు.. మోదీ, కేసీఆర్, తెలంగాణ మంత్రులు’ అని వెడ్డింగ్ కార్డులో ముద్రించారు. అంతేకాకుండా, ఈ వెడ్డింగ్ కార్డులను తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ అధికారిక ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు. ముందు నుంచి బీఆర్‌ఎస్ – బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.