వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర,నవంబర్ 28: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 న (బుధవారం) ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చే ఉద్యోగులందరూ ఉదయం 8:00 గంటలకు ఫెసిలిటేషన్ సెంటర్ కు చేరుకొని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, వెంటనే ఉదయం 9:00 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకోవాలని సూచించారు. విధులకు ఆలస్యంగా లేదా గైరాజరు అయినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
