Take a fresh look at your lifestyle.

పోరాట బావుట మల్లు స్వరాజ్యం..

దేశస్వాతంత్య్ర పోరాట కాలంలో పుట్టిన ఆమెకు  స్వరాజ్యం పేరుపెట్టారు. పేరుకు తగ్గకుట్టుగా ఆమె న్కెజాంకు వ్యతిరేకంగా రజాకార్లను ఎదురించింది. ఒక పక్కన తుపాకి పట్టుకుని మరొక పక్కన మంత్రసాని పనికూడ చేసిన అని రాసారు. ఒక ఊళ్లో ఐలమ్మ ధ్కెర్యంగా నిలబడ్డది. ‘దొరోడు ఏం పీకుతడో జూస్త’ అని అనగలిగింది. అది స్వరాజ్యం విజయం.

దేశస్వాతంత్య్ర పోరాట కాలంలో పుట్టిన ఆమెకు స్వరాజ్యం పేరుపెట్టారు. పేరుకు తగ్గకుట్టుగా ఆమె న్కెజాంకు వ్యతిరేకంగా రజాకార్లను ఎదురించింది. ఒక పక్కన తుపాకి పట్టుకుని మరొక పక్కన మంత్రసాని పనికూడ చేసిన అని రాసారు. ఒక ఊళ్లో ఐలమ్మ ధ్కెర్యంగా నిలబడ్డది. ‘దొరోడు ఏం పీకుతడో జూస్త’ అని అనగలిగింది. అది స్వరాజ్యం విజయం. ఆ విధంగా ఒక్కొక్క ఊరూ తిరగబడ్డది. స్వరాజ్యం మాటలు తూటాల్కె తిరగబడేట్టు చేసిన్కె. ఆ రోజుల్లో అంటే ఈనాటి ఆజాదీకా అమృతోత్సవ్‌ అని పండుగలు చేసుకోవడానికి 75 ఏళ్ల ముందు, పట్టిస్తే పదివేలు అని స్వరాజ్యం తలకు వెల కట్టాడు నిజాం రాజు. కాని జనం పదివేలకు కక్కుర్తిపడలేదు. తమకోసం తుపాకి పట్టిన వీర వనిత అని తెలుసు కనుక ఎవరూ పట్టివ్వలేదు. అక్క శశిరేఖ, సోదరుడు భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆయన సహాధ్యాయి రావి నారాయణ రెడ్డి ఆమెకు నిలబడే వెన్నెముకను, నిలదీసి అడిగే ధ్కెర్యాన్నిచ్చారు. అన్యాయం మీద మెదడు తొలిస్తే, నిలబడగలిగితే కదా తుపాకి పట్టుకోవడానికి చేయి కదిలేది.‘నీ కాల్మొక్త దొరా నీ బాంచెను’ అనకండి ‘దున్నేవాడిదే భూమి, గీసేవాడికే చెట్టు, భూమి కోసం భుక్తి కోసం ప్రజాస్వామ్య విముక్తి కోసం ఈ పోరాటం’ అనండి అని స్వరాజ్యం నినదించారు. ఆ రోజుల్లో యువతులచేత తుపాకీ పట్టించిన తూటాలు ఈ మాటలు. తన చిన్నతనంలో కుటుంబ సభ్యులు తమకున్న వందల ఎకరాలు పేదలకు దానం చేస్తుంటే చూసింది. తరువాత రజాకార్లు అతి క్రూరంగా జనం మీద పడి విలయతాండవం చేస్తుంటే సహించలేకపోయింది. ఇళ్లు గుంజుకుని, బట్టలు బోళ్లతోపాటు బయటికి తోసి, పొలాలు సొంతం చేసుకొని, ఊళ్లకు ఊళ్లు తగల బెట్టి, అత్యాచారాలు చేసి, ఏం చేయకపోయినా చంపేసి రజాకార్ల దండు చేయని అక్రమాలు లేవు. ఆ దండు వస్తే చావడం తప్పదు. ‘ఎట్లాగూ చస్తాం కదా.. చావడానికి సిద్ధంగా ఉందాం, శత్రువులను చంపడానికి సిద్ధపడదాం, చచ్చే ముందు చంపుదాం’ అని స్వరాజ్యం పల్లెటూళ్లలో దళాలను తయారు చేసారు.

అలుపెరుగకుండ అందరి చ్కెతన్య పరుస్తూ తన గళం ద్వారా ‘భారతి భారతి ఉయ్యాలో మా తల్లి భారతి ఉయ్యాలో, జనగామ తాలూక ఉయ్యాలో విసునూరి దొరోడు ఉయ్యాలో, న్కెజాం రాజ్యాన ఉయ్యాలో, వెట్టి చేయలేక ఉయ్యాలో, చచ్చిపోతున్నం ఉయ్యాలో.. అంటూ అందరిలో ఉద్యమ స్పూర్తిని రగిల్చారు. రజాకార్లు అతి క్రూరంగా జనం మీద పడి విలయతాండవం చేస్తుంటే సహించలేకపోయింది. వాళ్లు వడిసెల్లో రాళ్లు పెట్టి కొడతారు. కారపు నీళ్లు కళ్లల్లో చల్లుతారు. ఈ విధంగా మల్లు స్వరాజ్యం రాణి రుద్రమలా వీరనాణిగా ముందుకు సాగారు. న్కెజాం రాజు ఆమెను పట్టిస్తే పదివేలు అని స్వరాజ్యం తలకు వెల కట్టాడు . కాని జనం పదివేలకు కక్కుర్తిపడలేదు. తమకోసం తుపాకి పట్టిన వీర వనిత అని తెలుసుకొని కడుపులో పెట్టుకొని కాపాడినారు. ఆమె సోదరి శశిరేఖ, సోదరుడు భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆయన సహాధ్యాయి రావి నారాయణ రెడ్డి ఆమెకు నిలబడే వెన్నెముకను, నిలదీసి అడిగే ధ్కెర్యాన్నిచ్చారు.

ఆమె మరింత ఉత్సహంతో గ్రామాలు తిరుగుతూ దున్నేవాడిదే భూమి, గీసేవాడికే చెట్టు, భూమి కోసం భుక్తి కోసం ప్రజాస్వామ్య విముక్తి కోసం ఈ పోరాటం’ అనండి అని స్వరాజ్యం నినదించారు. చివరకు సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా మూడువేల గ్రామాలు విముక్తమైనాయి. నిజాం కూలిపోయాడు. హైదరాబాద్‌ ‌భారతదేశంలో కలిసింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగపరమైన స్వరాజ్యపాలన వచ్చాయి. కాని పేదల బతుకులు, వారి పైన కొత్త భూస్వాముల పెత్తనం మారలేదని మల్లు స్వరాజ్యం బాధపడేవారు. అయిన ఇంకా దున్నేవాడు భూమికోసం పోరాడుతూనే ఉన్నాడు. గీసేవాడు చెట్టు అడుగుతూనే ఉన్నాడు. దున్నేవాడికే భూమి అని ఇంకా చెప్పుకుంటూనే ఉన్నామని కుమిలిపోయేవారు. మల్లు స్వరాజ్యం తొలుత 1978లో, ఆ తరువాత 1983లో శాసనసభకు ఎన్నికైనారు. తన 91వ ఏట వరకు అనగా ఈనెల 19న చనిపోయే వరకు తను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుపడ్డారు. మల్లు స్వరాజ్యంను నేటి రాజకీయ నాయకులు,యువతీ, యువకులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె పోరాట పటిమ తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు స్థిరస్థాయిగా ఉంటుంది.

– పీవీ మదన్‌మోహన్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్టు

హన్మకొండ జిల్లా, 9848072295

Leave a Reply