Take a fresh look at your lifestyle.

పోక్సో కేసులో 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష

కొత్తగూడెం జిల్లా పోక్సో స్పెషల్‌ ‌జడ్జి కీలక తీర్పు
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : పొక్సో కేసులో వ్యక్తికి 25 సంవత్సరములు కఠిన కారగారి శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ ‌జడ్జి పోక్సో స్పెషల్‌ ‌జడ్జి ఎం. శ్యామ్‌ ‌శ్రీ  బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే…2018లో దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామానికి చెందిన అజ్మీర సాయికిరణ్‌  16 ‌నెలల  పాపపై అత్యాచారానికి  పాల్పడ్డట్టు దుమ్ముగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఇన్స్పెక్టర్‌ ‌బి బాలకృష్ణ కేసు నమోదు  చేసుకున్నారు.

అప్పటి అసిస్టెంట్‌ ‌సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌డాక్టర్‌ ‌సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌పాటిల్‌ ‌కేసు దర్యాప్తు అనంతరం, సాయి కిరణ్‌ అత్యాచారానికి పాల్పడ్డట్టు ప్రాసిక్యూషన్‌ ఆరోపించి కోర్టులో ఛార్జ్ ‌షీట్‌ ‌చేశారు. కోర్టులో 12 మంది సాక్షుల విచారణ, వాదోపవాదాల అనంతరం అజ్మీర సాయికిరణ్‌పై నేరం రుజువైనదని కోర్టు భావించి 25 సంవత్సరముల కఠిన కారకార శిక్ష మరియు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ ‌తరపున అదనపు పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌పివిడి లక్ష్మి నిర్వహించారు. హరిగోపాల్‌ ‌దుమ్ముగూడెం కోర్టు పిసి.సి.హెచ్‌. ‌హనుమంతరావులు సహకరించారు

Leave a Reply