చైత్ర మాసపు ఉషస్సులా,
ఆనంద భాగ్యాలనిచ్చు
వసంతవాహినిలా,
ప్రజల మదిన రమ్యభావమలర
ఆత్మీయతానురాగాల్ని
ఆకాంక్షల భావాల్ని పెనవేసుకుంటూ
తెలుగునేల వైభవం వెలిగేలా
సంస్కృతీ సంప్రదాయాలు
సందడి చేస్తుంటే,
విచ్చేస్తున్నజి
తెలుగువారి షడ్రుచుల
సంతోషాల సారధీ ఓ శుభకృత్!
ఊహలకు సరికొత్త ఊపిరినిస్తావని
నీ కోసం తెలుగు లోగిళ్లు
వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాయి.
బతుకుల్లో బాకులు దూసిన
గతవత్సరపు మాలిన్యాల్ని కడిగేయ్.
ఓటుబ్యాంకు రాజకీయుల పీచమడుచు,
రాకెట్లతో పోటీ పడే ధరల్ని దించు.
అశుభాల మూటల్ని పేల్చేయ్.
నీ రాకతో జనుల జీవితాల్లో
కళ రావాలి,
సార్ధక నామధేయరాలివి
అవుతావుగా….
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం