- హైదరాబాద్‌లో కంపెనీల విస్తరణకు అవకాశాలు మెండు
- జాంప్ ఫార్మాను ప్రారంభించిన కేటీఆర్
- అజీమ్ ప్రేమ్‌జీ ఆదర్శ నాయకుడు విప్రో కన్జూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభంలో కెటిఆర్
- జీడీపీ దూసుకెళుతుంది…పెట్రో ధరల పెరుగదలపై ప్రధాని మోడీపై మంత్రి కెటిఆర్ వ్యంగ్యాస్త్రం
ప్రజాతంత్ర, హైదాబాద్, ఏప్రిల్ 5 : ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంగళవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కెనడా తర్వాత హైదరాబాద్‌లో జాంప్ హైదరాబాద్ లోనే పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ను పరిశీలించిన అనంతరం.. కంపెనీ హైదరాబాద్‌ను ఎంచుకుందన్న మంత్రి.. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్ వ్యాలీ అనువుగా ఉంటుందని, యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్‌నే ఇష్టపడుతున్నారన్నారు. గ్లోబల్ టీకా ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33శాతం ఉందని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే జాంప్ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ-హబ్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలో బీ-హబ్‌ను ప్రారంభించి, బయోలాజికల్ పరిశోధనలకు తోడ్పాటును అందించ బోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. అనంతరం జాంప్ ఫార్మా ఆవరణలో మొక్కలు నాటారు. రూ.250 కోట్లతో జాంప్ ఫార్మా ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని, ఈ పార్మా ద్వారా 200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఫైవ్ స్టార్ హోటల్స్ జీనోమ్ వ్యాలీకి దగ్గరలో రానున్నాయి.
అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్ వ్యాలీ అనువుగా ఉందన్నారు. కంటోన్మెంట్‌లో స్కెవేల నిర్మాణానికి అనుమతులు అడుగుతున్నామని కెటిఆర్ చెప్పారు. ఏడేళ్లుగా కేంద్రం మా ప్రతిపాదనలను పట్టించు కోవట్లేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ రహదారి విస్తరణకు కేంద్రం ముందుకు వొస్తుందన్న ఆశాభావం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ-హబ్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఐటి సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అజీమ్ ప్రేమ్‌జీ ఆదర్శ నాయకుడు…ఆయనజీవితం అందరికీ అనుసరణీయం : విప్రో కన్జూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభంలో కెటిఆర్
అజీమ్ ప్రేమ్‌జీ వంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం, మంచి పాఠం అని ఆయన పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందరికీ ఆదర్శమని కొనియాడారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ- సిటీలో విప్రో కన్జూమర్ కేర్ ఫ్యాక్టరీని ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అజీమ్ ప్రేమ్‌జీని మంత్రులు శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహేశ్వరం నియోజకవర్గంలో రూ.
300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని, ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కందుకూరు, మహేశ్వరానికి చెందిన 90 శాతం మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ కంపెనీలో ఉత్పత్తి అయ్యే వస్తువుల తయారీలో భాగంగా ఏర్పడే కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా సరళతర వాణిజ్యం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
జీడీపీ దూసుకెళుతుంది…పెట్రో ధరల పెరుగదలపై ప్రధాని మోడీపై మంత్రి కెటిఆర్ వ్యంగ్యాస్త్రం
దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి..మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మరోసారి వ్యంగ్యోక్తులు విసిరారు. గత రెండు వారాల్లో..దేశవ్యాప్తంగా దాదాపు 10 రూపాయలు పెరిగిన పెట్రో ధరలను ప్రస్తావిస్తూ కేటీఆర్ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారు?. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజూ పెంచుతూ..జనాలకు దానిని ఒక అలవాటుగా మార్చినందుకు ప్రధాని మోదీగారికి ధన్యావాదాలు. బీజేపీలో మేధావులైన కొందరు నేతలు..ఇప్పుడు ఇదంతా ఈవీ(ఎలక్ట్రి వాహనాలను)లను ప్రమోట్ చేసేందుకు మోదీగారు చేస్తున్న మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పుకుంటారు కూడా అని ట్వీట్ చేశారు కేటీఆర్.