భూమాత చల్లని ఒడి
కోట్ల జీవరాశులకే గుడి
ప్రాణికోటికే ఆవాసమది
పుడమి తల్లికే పచ్చలహారం
ధరిత్రి దీవెనలే ఆయురారోగ్యం
భూగ్రహ కాలుష్య బూతం..
జీవుల మనుగడకే శాపం !
జలావరణానికే జేజేలు
వాతావరణానికి వాగ్దానాలు
శిలావరణానికే శ్రేయస్సులు
జీవావరణానికి జవజీవాలు
పర్యావరణానికి హరిత చీరలు
ఆదమరిస్తే ప్రాణాంతకాలు !
గాలి కాలుష్యాన్ని కట్టడి చేసి..
నేల కాలుష్యాన్ని తరిమి కొట్టి..
నీటి కాలుష్యాన్ని వడకట్టి వంచి..
శబ్ద కాలుష్యాన్ని నిశ్శబ్దతతో తరిమి..
రేడియేషన్ హానికి దూరం జరిగి..
పర్యావరణానికే పట్టం కట్టి..
భూమాత మెడన పచ్చలహారం వేద్దాం !
(22 ఏప్రిల్ ‘‘ప్రపంచ ధరిత్రి దినం’’ సందర్భంగా)
– మధుపాళీ,కరీంనగర్, 9949700037