- పంటలకు కనీస మద్దతు ధర..వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ రద్దు
మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు … దేశవ్యాప్తంగా కులగణన
విద్యారుణాల రద్దుకు నిర్ణయం….పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష నగదు బదిలీ
యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు
రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత..అగ్నిపథ్ రద్దు
ఎలక్టోరల్ బాండ్స్, పెగాసస్, రఫేల్ అంశాలపై పూర్తి స్థాయి విచారణ
న్యూదిల్లీ, ఏప్రిల్ 5 : తమ మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నామని, దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా దీనిని ప్రజలు గుర్తుంచు కుంటారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి ఆయన లోక్ సభ ఎన్నికలకు కాంంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలు దీనిలో ఉన్నాయని, ‘యువ న్యాయ్’ కింద ప్రతి విద్యావంతుడికి అప్రంటీస్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తామని…దీని కోసం ఒక్కొక్కరిపై రూ.లక్ష వెచ్చిస్తామని, మహిళా న్యాయ్’ కింద పేద ఇంటి ఆడవారికి ఏటా రూ.లక్ష సాయం చేస్తామని, ‘కిసాన్ న్యాయ్’ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్పీ చట్టాలకు హావ్ని ఇస్తున్నామని, ‘శ్రామిక్ న్యాయ్’ కింద ఉపాధి హావ్ని పథకంలో కనీసం రూ.400 వేతనం ఇస్తామని, ‘హిస్సేదార్ న్యాయ్’లో సామాజిక, ఆర్థిక సమానతల కోసం జాతీయ జనగణన చేపడతామని, ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదని, కేవలం ప్రజల స్థితిగతులపై అవగాహన కోసమే చేపడుతున్నామన్నారు. రాష్ట్రాలకు అందాల్సిన నిధులను ఇస్తామని, ‘రక్షా న్యాయ్’ కింద విదేశీ వ్యవహారాల్లో కూడా మార్పులు తీసుకొస్తామని, తాము చేయగలిగిన అంశాలనే మేనిఫెస్టోలో చేర్చామని అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వొచ్చింది.
అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని ముందుకు సాగే లక్ష్యంతో ఆకర్షణీయమైన, ఆచరణసాధ్యమైన హావ్నిలను పొందుపర్చిన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. 48 పేజీలతో కూడిన మ్యానిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అవసరమయ్యే విధంగా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించి దానికి చట్ట భద్రత కల్పిస్తామని ఖర్గే హావ్ని ఇచ్చారు. ఎన్నో రోజులుగా ఊరిస్తూ వొచ్చిన పార్టీ మొత్తానికి హావ్నిలను ప్రకటించింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోని విడుదల చేసింది. మొత్తం 25 హావ్నిలు వెల్లడిరచింది. సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడిరచింది. రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50శాతం పరిమితిని తొలగిస్తామని హావ్ని ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని తెలిపింది. వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని హావ్ని ఇచ్చింది. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడిరచింది. అగ్నివీర్ స్కీమ్‌ని రద్దు చేస్తామని తెలిపింది.
మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష నగదు అందిస్తామని హావ్ని ఇచ్చింది. కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారెంటీ కూడా ఈ హావ్నిల జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మరో ఆసక్తికర హావ్నిని చేర్చింది. యువకులు, మహిళలతో పాటు రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోని రూపొందించింది కాంగ్రెస్. అన్ని వర్గాలకూ సమన్యాయం జరిగేలా చూస్తామన్న సంకేతమిచ్చేలా పాంచ్ న్యాయ్ పేరిట ఈ హావ్నిలను తయారు చేసింది. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్ పేరిట వీటిని ప్రకటించింది. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ హావ్ని ఇచ్చింది. ఈ డేటా ఆధారంగా ఆయా వర్గాల సంక్షేమానికి సహకరిస్తామని వెల్లడిరచింది. రిజర్వేషన్లపై ఇప్పటి వరకూ ఉన్న 50 శాతం పరిమితి తొలగించడంతో షెడ్యూల్ తెగలు,షెడ్యూల్ కులాలకు మేలు జరుగుతుందని వివరించింది. కులగణన తరవాత ఈ 50 శాతం పరిమితిని తొలగించేలా రాజ్యాంగంలో సవరణలు చేస్తామని తెలిపింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి చెందిన వాళ్లకి విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడిరచింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయడాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ వెల్లడిరచింది. ఎలక్టోరల్ బాండ్స్‌పై విచారణతో పాటు పెగాసస్, రఫేల్ అంశాలపైనా పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హావ్ని ఇచ్చింది. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. పాతపద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తామని వెల్లడిరచింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని మినహాయిస్తామని హావ్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడిరచారు. ఉపాధి హావ్ని పథకం కింద రోజుకు రూ. 4 వందలు ఇస్తామని హావ్ని ఇచ్చారు. మ్యానిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలను పొందుపరిచారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం వివరించారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని హావ్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ హయాంలో ఒక్కటైనా పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చారా..అంటూ ఖర్గే ప్రశ్నించారు.
కేవలం తిట్లు తప్పితే ఆయన పాలనలో మరేవ్ని వినలేదని, విపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారని, ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలేదని, తమ పార్టీపై రూ.3,500 కోట్ల జరిమానాలు విధించారని, నేడు తమపై జరిగినవి.. రేపు వ్నిడియాపై జరగవచ్చునన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోదీని గ్దదె దించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ హావ్నిలును వారి వద్దకు చేర్చాలని ఖర్గే సూచించారు. అవినీతిపరులను పార్టీలో చేర్చుకుని భాజపా తమను నిందిస్తుందని ఖర్గే దుయ్యబట్టారు. ప్రధాని ఇప్పటి వరకు భయపడి మణిపుర్ వెళ్లలేదని, తమ నేత రాహుల్ అక్కడికి వెళ్లారని, భయపడే నేత దేశానికి మంచి చేయలేరని ఖర్గే పేర్కొన్నారు. వర్కింగ్ కమిటీలో పూర్తిస్థాయిలో చర్చించి మేనిఫెస్టోను తయారు చేసినట్లు పార్టీ నేత, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ పి.చిదంబరం తెలిపారు. గత పదేళ్లలో అన్ని రకాల న్యాయాలు ప్రజలకు అందలేదని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ సంస్థలను పనిచేయనీయకపోవడం, బలహీన వర్గాల అణచివేత కొనసాగుతుందన్నారు. పార్లమెంట్ వ్యవస్థను కూడా బలహీనపర్చారని ఆరోపించారు. గత పదేళ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలిపారు. ‘వర్క్, వెల్త్, వెల్ఫేర్’(ఉద్యోగాలు, సంపద, సంక్షేమం)ను ప్రజలకు అందిస్తామన్నారు. యూపీఏ తొలి విడత పాలనలో 8.5 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. గత పదేళ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చిందని.. 2024లో అధికారం చేపట్టాక మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని చిదంబరం పేర్కొన్నారు. మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాల మొత్తం రద్దు చేస్తాం. ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్ లాను ఎంచుకొనే హక్కు ఇస్తాం. తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టాన్ని సవరిస్తాం అని వెల్లడించారు.




