తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రికే విజయలక్ష్మిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. భర్త జ్ఞాపకార్థం మొక్కను పెంచుతూ పర్యావరణ స్పూర్తిని కలిగించిన వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రీక విజయలక్ష్మి ని ఎంపీ జోగిని పల్లి సంతోష్ కుమార్ అభినందించి సన్మానం చేశారు. భర్త జ్ఞాపకాన్ని పది కాలాలపాటు పదిమందికి నీడనివ్వడం కోసం చెట్టు నాటి పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణ కోసం బాటలు వేస్తున్నవికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రిక విజయలక్ష్మి వెంకటయ్య గారిని ఫోన్ చేసి బుధవారం హైదరాబాద్ ప్రగతి భవన్ కు పిలిపించుకొని అభినందిస్తూ శాలువాతో మొక్కను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మరిన్ని సేవకార్యక్రమాలు చేయాలని సూచించారు. ప్రకృతి సేవకు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అండగా ఉంటుందని జోగినిపల్లి ఎంపి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ కోటం సిద్ది లింగం,,సోషల్ వర్కర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.