పంజాబ్‌ ‌విధానమే తెలంగాణలోనూ అనుసరిస్తున్నాం

  • దేశమంతటా ఒకే రకంగా బియ్యం సేకరణ
  • రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ‌రాజకీయం
  • రా రైస్‌ ఎం‌తిస్తారో ఇప్పటికీ చెప్పడం లేదు
  • టిఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తూ రైతులను మోసం
  • వి•డియా సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ఆ‌గ్రహం
  • కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో 40 నిమిషాల పాటు తెలంగాణ మంత్రుల సమావేశం

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : పంజాబ్‌లో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలో కూడా అనుసరిస్తున్నామని, తెలంగాణ రైతులకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర ఆహార పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అన్నారు. అన్ని రాష్ట్రాలలో ముడి బియ్యం సేకరిస్తున్నామని, తెలంగాణాలో కూడా సేకరిస్తామని, ముడి బియ్యం ఎంత ఇస్తారని…? ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ప్రభుత్వం చెప్పడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు స్పందించాయని, ఒప్పందం ప్రకారమే ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ అఫ్‌ ఇం‌డియా ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదని ఆయన అన్నారు. కెసిఆర్‌ ‌ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు అంశం వేడెక్కి వున్న నేపథ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. తన కార్యాలయంలో తెలంగాణ మంత్రులతో ఆయన సమావేశం 40 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా వందశాతం వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసారు.

రాష్ట్ర మంత్రులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ముడిబియ్యం సరఫరా చేస్తామని తెలంగాణ లిఖితపూర్వకంగా వెల్లడించిందని, తెలంగాణ అవసరాలు పోను మిగిలిన ముడిబియ్యం తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణపై మాకు ఎలాంటి వివక్ష లేదని మత్రులకు ఆయన స్పష్టం చేసారు. పంజాబ్‌ ‌తరహాలోనే తెలంగాణ నుంచి కూడా ధాన్యం సేకరణ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించాలని ఆయన అన్నారు. తెలంగాణ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్నారు .ధాన్యంసేకరణపై తప్పుడు ప్రచారాన్ని కెసిఆర్‌ ‌మానుకోవాలన్నారు. ఏపికూడా 25లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ముడిబియ్యం ఇస్తుందని, తెలంగాణ ముడిబియ్యం సప్లయికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25న అన్ని రాష్ట్రాలను పిలిచి, ఎవరెంత ఇస్తారని తాము అడిగామని, అన్ని రాష్ట్రాలు సమాచారం ఇచ్చినా, తెలంగాణ తామెంత ముడిబియ్యం ఇవ్వనున్నదో చెప్పలేదని పీయూష్‌ ‌గోయల్‌ ‌తెలిపారు. సమాచారం ఇవ్వకుండా కెసిఆర్‌ ‌ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, కెసిఆర్‌ ‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎలాంటి వివక్ష లేకుండా దేశమంతటా కేంద్రం బియ్యం సేకరణ చేస్తుందని రాష్ట్ర మంత్రులకు ఆయన భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page