నేడు రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ

యాసంగి వడ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌నేడు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా యాసంగి వడ్ల కొనుగోలుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. సోమవారం దీక్ష సందర్భంగా కేంద్ర తమ స్పందనను తెలియజేయటానికి సిఎం కెసిఆర్‌ 24 ‌గంటల డెడ్‌లైన్‌ ‌పెట్టిన నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం నుంచి స్పందన వొచ్చినా..రాకపోయినా మంత్రివర్గ సమావేశంలో యాసంగి వడ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇక సిఎం కెసిఆర్‌ ‌తన పది రోజుల పర్యటన అనంతరం హైదరాబాద్‌ ‌చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page