ఇల నడయాడే పిల్లలు
దైవానికి ప్రతిరూపాలు
విధాతకు ప్రతిబింబాలు
విశ్వ ప్రేమలకు ప్రతీకలు
నేటి చిన్నారి బాలలు
భావి భారత పౌరులు
జాతి భాగ్య విధాతలు
సమసమాజ నిర్మాతలు
నవయుగ రథసారథులు
ఆ చూపులు కురిసే వెన్నెల
ఆ పదాలు పారే హిమజల
ఆ స్వరాలు వేకువ రాగాలు
ఆ స్పర్శలు చల్లని సమీరాలు
ఆ మోములు మెరిసే తారలు
ఆ నగవులు విరిసే సుమాలు
ఈ శుభతరుణం నుండి
చిట్టి బాలల జీవితాలకు
మనం బాసటగా నిలుద్దాం
బంగారు భవిత అందిద్దాం
ధర్మం,సత్యం,నీతి,న్యాయం
మంచి,మానవత్వం ఇత్యాది
వికాస విలువలు ప్రబోధిద్దాం
ఉన్నతులుగా అవిష్కరిద్దాం
ఆనాధలు అభాగ్య చిన్నారుల
చేరదీసి అక్షరజ్ఞానం అందిద్దాం
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం
బాలల హక్కుల పరిరక్షించుదాం
ఈ వ్యవస్థలోని బాలలను
జ్ఞానసంపన్నులుగా మలిచి
భారతావని అందించుదాం
(జూన్ 1 అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493