తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నేటి నుండి ప్రారంభం కానుందని తాండూరు ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు గురువారం మీడియాతో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేటి నుంచి ఈనెల 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగ నున్నట్లు తెలిపారు. నామినేషన్ ఉదయం 11 గంటల సమయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని పేర్కొన్నారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు నలుగురు, 3 వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థి నామినేషన్ ఫీజు బిసి లకు 10వేలు ఎస్సీ ఎస్టీలైతే 5 వేలు డిపాజిట్ చేయాలని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్ స్టేషన్లు, మొత్తం ఓటర్లు 2.35.363 మంది, 155 లొకేషన్స్ 51 క్రిటికల్ 23 రూట్ లు, 1000 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నామినేషన్ల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయం నుండి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించనున్నట్లు తెలిపారు. ఓటర్గా నమోదుకు ఎన్నికల కమిషన్ ఈ నెల10వ తేదీ వరకు ఓటర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పది వరకు కావున నామినేషన్ వేసి అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సమయంలోపు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. నామినేషన్ వేసే ఆయా అభ్యర్థులు ప్రజలు సహకరించాలని కోరారు.