నేటి నుంచి కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శివిర్‌

  • ‌వొచ్చే ఎన్నికలు లక్ష్యంగా చర్చలు
  • పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగంతో ప్రారంభం కానున్న రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌
  • ‌రైతు డిక్లరేషన్‌పై ఇక జనంలోకి రాష్ట్ర కాంగ్రెస్‌…‌ గ్రామాలకు వరంగల్‌ ‌‌డిక్లరేషన్‌

‌న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మే 12 :వొచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి సవాల్‌ ‌విసిరేందుకు అవసరమైన వ్యూహరచన చేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ చింతన్‌ ‌శివిర్‌ ‌నిర్వహిస్తుంది. రాజస్థాన్‌లో దీనిని రెండురోజుల పాటు నిర్వహించబోతున్నారు. ఇందులో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సంబంధించి చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఉదయపూర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగంతో ప్రారంభంకానున్న రెండు రోజుల జాతీయ వర్క్ ‌షాప్‌, ‌మే 14న రాహుల్‌ ‌ప్రసంగంతో ముగియనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మార్చి 14న జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశం (సిడబ్ల్యుసి)లో రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాల్సిందేనంటూ పలువురు సీనియర్‌ ‌నేతలు డిమాండ్‌ ‌చేసిన సంగతి తెలిసిందే.

రాహుల్‌ ‌బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సీనియర్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరి పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆగస్ట్-‌సెప్టెంబర్‌ ‌మధ్యలో నిర్వహించే అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, తదుపరి చింతన్‌ ‌శివిర్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీనియర్‌ ‌నేతలు పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐదురాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందే కసరత్తు చేయాల్సి ఉన్నందున పూర్తికాలం అద్యక్షుడి అవసరం ఉందని కాంగ్రెస్‌ ‌విధేయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని గాడిలో పెట్టాలంటే అధ్యక్షుడి అసవరమని, లేకుంటే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

రైతు డిక్లరేషన్‌పై ఇక జనంలోకి రాష్ట్ర కాంగ్రెస్‌…‌గ్రామాలకు వరంగల్‌ ‌డిక్లరేషన్‌

‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగనుంది. ఈ మేరకు 16న కాంగ్రెస్‌ ‌పొలిటికల్‌ అఫైర్స్ ‌కమిటీ సమావేశం నిర్వహించనుంది. రైతు డిక్లరేషన్‌పై 300 మంది నేతలతో జనంలోకి కాంగ్రెస్‌ ‌వెళ్లనుంది. పల్లె పల్లెకు కాంగ్రెస్‌ ‌పేరుతో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఒక్కో నేతకి 30 గ్రామాల బాధ్యత అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఉంది. వరంగల్‌ ‌డిక్లరేషన్‌ను గ్రామాలకు చేర్చాలన్న రాహుల్‌ ‌సూచనల నేపథ్యంలో ఇక కాంగ్రెస్‌ ‌గ్రామాల బాట పట్టనుంది. ఊరూరా రైతుల సమస్యలపై చర్చించి, టిఆర్‌ఎస్‌ను నిలదీసే బాధ్యతను నేతలకు అప్పగించనుంది. ఈ మేరకు వరంగల్‌ ‌సభ లక్ష్యాల మేరకు సాగనుంది. ఈ క్రమంలోను టిఆర్‌ఎస్‌ ‌విమర్శలకు పిసిసి నేతలు దూకుడుగానే సమాధానం ఇస్తున్నారు. నీ లెక్కెంత అన్న రీతిలో ఎదురుదాడి చేస్తున్నారు. కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావు విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నారు.

ఇటీవల వరంగల్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ నిర్వహించిన రైతు డిక్లరేషన్‌ ‌సభను చూసి అధికార టీఆర్‌ఎస్‌ ‌వణుకు మొదలైతే, బీజేపీకి భయం పట్టుకుందని కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీ చైర్మన్‌ ‌మధు యాష్కీ గౌడ్‌ ఎద్దేవా చేశారు. రాహుల్‌ ‌గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టిలేపిందన్న మధుయాష్కీ గౌడ్‌.. ‌రైతు డిక్లరేషన్‌పై రాష్టంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ’రైతు డిక్లరేషన్‌ ‌లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల అధ్యక్షులు ప్రెస్‌ ‌వి•ట్‌ ‌లు పెట్టి రైతు డిక్లరేషన్‌ ‌ప్రచారం చేయాలి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో వి•టింగ్‌ ఏర్పాటు చేసుకుని రైతు డిక్లరేషన్‌ ‌ను నెల రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. సోనియాగాందీ వల్ల తెలంగాణ రాష్ట్రం వొచ్చిందని కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రాహుల్‌ ‌పర్యటన తరవాత పార్టీలో విభేదాలు పక్కన పెట్టిన నేతలు ఇక ఎవరికి వారు తమ సత్తా చాటేందుకు దీనిని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రజల్లోకి వెళతామని సీనియర్‌ ‌నేత విహెచ్‌ ‌ప్రకటించారు. మరో సభ కూడా ఉంటుందని పార్టీ సీనియర్‌ ‌నేత మధుయాష్కీ వెల్లడించారు. మరోవైపు, టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌వరంగల్‌ ‌సభపై చేసిన విమర్శలకు కూడా నేతలు ఘాటుగానే స్పందించారు.

రాహుల్‌ ‌గాంధీపై కేటీఆర్‌ ‌చేసిన టూరిస్టు వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఘాటుఆనే స్పందించారు. వి• దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ‌ప్లేస్‌ అయి ఉండొచ్చు! కాంగ్రెస్‌ ‌దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. వి• వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ‌ప్లేస్‌ అనుకున్నా దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే అని ట్వీటర్‌ ‌వేదిక కౌంటర్‌ ఇచ్చారు. మొత్తం వి•ద వరంగల్‌ ‌సభ ద్వారా తెలంగాణ రాజకీయాలు టీర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌చుట్టూ తిరుగుతాయనటంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page