Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ భారతం

‘‘‌ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది పోస్ట్ ‌గ్రాడ్యుయేట్స్, ఇం‌జనీర్లు, ఎంబీఏ చదివారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా, వారి స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు కొనుక్కోడానికి కూడా పైసలు ఉండవని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశాన్ని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. కరోనా సమయంలో ప్రభుత్వ ఖర్చు విపరీతంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. అన్ని రంగాల అన్ని రకాల ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతున్నాయి.’’

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది పోస్ట్ ‌గ్రాడ్యుయేట్స్, ఇం‌జనీర్లు, ఎంబీఏ చదివారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా, వారి స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు కొనుక్కోడానికి కూడా పైసలు ఉండవని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశాన్ని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. కరోనా సమయంలో ప్రభుత్వ ఖర్చు విపరీతంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. అన్ని రంగాల అన్ని రకాల ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతున్నాయి.

సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, నిరుద్యోగిత రేటు డిసెంబర్లో దాదాపు 8 శాతానికి పెరిగింది. 2020లో, 2021లో చాలావరకు ఇది 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. తాజా నిరుద్యోగిత రేటు, భారతదేశంలో కనీసం గత మూడు దశాబ్ధాలుగా నమోదైన దానికంటే చాలా ఎక్కువ. 1991నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇప్పుడున్న నిరుద్యోగత లేదు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం పెరిగింది. కానీ దేశంలో ఇది మరింత ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్‌ (5.3 %), ‌మెక్సికో (4.7 %), వియత్నాం (2.3 %) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా మనదేశంలో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉన్నది. అంతేకాకుండా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా కాలంలో ఖర్చును తగ్గించుకోవడానికి, ఉద్యోగులను తొలగించే పద్ధతిని కంపెనీలు అవలంభించడం ఇందుకు ఒక కారణమని సీఎంఐఈ పేర్కొంది. 2020 లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో, 15 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగులే దీనివల్ల ఎక్కువగా నష్టపోయారని ఒక అధ్యయనంతో తెలియవచ్చినది. అంతా గందరగోళంగా ఉంది. లాక్‌ ‌డౌన్‌ ‌ముందు ఉద్యోగాలు చేస్తోన్న వారిలో సగం మంది ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు కనుగొన్నారు. ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోవడానికి, కరోనా కొంతవరకు మాత్రమే కారణమని వివిధ సర్వేలు తెలియజేస్తున్నవి. ఉద్యోగుల చిన్నతరహా వ్యాపారుల లబ్ధి కోసం పాలసీలను రూపొందించడంలో తక్కువ శ్రద్ధ వహిస్తారని మనదేశంలోని పరిస్థితులు అద్దం పడుతున్నాయి. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో మనం చవిచూసినాము. పనిచేసే వయస్సుకి వచ్చిన జనాభా పరంగా చూస్తే వీరిలో ఇప్పుడు పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయింది. శ్రామిక శక్తిలో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న మహిళల నిష్పత్తి, ప్రపంచంలో మన దగ్గరే అత్యల్పంగా ఉన్నది. మనదేశంలో నిరుద్యోగాన్ని చూస్తే, విద్యావంతులైన యువకులు బతుకు బండి లాగడం కోసం ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తున్నది.

నిరుద్యోగం అనేది విద్యావంతులు, డబ్బున్నవారు మాత్రమే భరించగలిగే విలాసవంతమైన వస్తువు. పేదవారు, నైపుణ్యం లేని లేదా తక్కువ నైపుణ్యాలున్న వ్యక్తులు దీన్ని భరించలేరు’’ అని కార్మిక ఆర్థికవేత్త రాధిక కపూర్‌ అన్నారు.

ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులే ఎక్కువగా నిరుద్యోగంలో చిక్కుకుపోతున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు తక్కువ స్థాయి, హోదా ఉన్న ఉద్యోగాలను చేసేందుకు ఇష్టపడరు. మరోవైపు ఎక్కువగా చదువుకోలేని పేదవారు మాత్రం చేతికొచ్చిన పనిని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. దేశంలోని శ్రామిక శక్తిలో మూడొంతుల మంది స్వయం ఉపాధి పొందుతున్నవారే. వీరికి రిటైర్మెంట్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌, ‌హెల్త్ ‌కేర్‌, ‌మెటర్నిటీ బెనిఫిట్స్ ‌వంటి ఎలాంటి సోషల్‌ ‌సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉం‌డవు.

శ్రామిక శక్తిలో కేవలం అతి తక్కువ శాతం మంది మాత్రమే రిటైర్మెంట్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు, మూడు కంటే ఎక్కువ సంవత్సరాల పాటు రాతపూర్వక ఒప్పందాలు వంటి సోషల్‌ ‌సెక్యూరిటీతో కూడిన సాధారణ ఉద్యోగాలతో పనిచేస్తున్నారు. మరో కొంత శాతం కనీసం ఒక సామాజిక భద్రత ప్రయోజనాన్ని కలిగి ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.’’భారత్‌ ‌లోని శ్రామిక శక్తిలో ఎక్కువ మంది దుర్బలంగా ఉన్నారు. వారి ఉనికి సందిగ్ధావస్థలో ఉంది’’ అని డాక్టర్‌ ‌కపూర్‌ అన్నారు.. సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నది. ఉద్యోగాలు చేస్తున్నవారిలో, నెలకు జీతంగా రూ. 9,750 కన్నా తక్కువ పొందుతున్నవారు దాదాపు 55 శాతంగా ఉన్నారని సర్వేలు తెలుపుతున్నాయి రోజుకు కనీస వేతనం రూ. 375 ఉండాలని 2019లో ప్రతిపాదించారు. కానీ ఇది తర్వాత అమలు కాలేదు. ఈ ప్రతిపాదిత వేతనం కంటే కూడా తక్కువ జీతాన్ని ఉద్యోగులు పొందుతున్నారు. ప్రాథమికంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనదేశం తర్వాత సేవల రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారడం దేశంలో స్థానిక నిరుద్యోగం పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. భారతదేశ పరిమాణంలో ఉన్న మరే ఇతర దేశంలోనూ ఆర్థికాభివృద్ధి సేవల రంగం ద్వారా జరగడం లేదు. అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మాత్రమే చేయగలిగే ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ ఆర్థిక సంస్థల వంటి సేవల రంగం ద్వారా దేశం ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నది. పెద్దగా నైపుణ్యాలు లేని వారికి ఉద్యోగాలనిచ్చే తయారీ సంస్థలు లేదా కర్మగారాలలో ఉద్యోగాలు మన దగ్గర చాలా తక్కువగానే ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం ఆందోళనకరంగా ఉన్నది. దేశం ఆర్థికాభివృద్ధిలో పుంజుకుంటున్నప్పటికీ, దిగువ విభాగం ఇతర చాలా దేశాల కంటే అధ్వాన్నంగా ఉన్నది. ప్రభుత్వం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ఉపాధిని కల్పించాలని, ఉద్యోగులకు ప్రభుత్వాలు మద్దతుగా ఉండాలి. వివక్ష, విద్వేష రాజకీయాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆర్థికాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి. పుష్కలంగా ఉద్యోగాలను వస్తాయని వాగ్ధానం చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ, కీలక పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ‘మేకిన్‌ ఇం‌డియా’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కానీ వీటిలో ఇప్పటివరకు ఏదీ కూడా తయారీ, ఉద్యోగాల కల్పించుటకు దారి తీయలేదు. డిమాండ్‌ ‌తగ్గడమే ఈ పరిస్థితికి కారణం. దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం కుటుంబాలకు నగదు బదిలీ, ఉపాధి హామీ పథకం వంటి వాటిని అమలు చేయాలని చాలామంది ఆర్థిక రంగ నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలంలో ఉద్యోగులందరికీ కనీస వేతనం, సామాజిక భద్రత అమలయ్యేలా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ‘’అప్పటివరకు ఉద్యోగాల్లో మనకు ఎలాంటి అర్థవంతమైన సంస్కరణలు రావు’’ అని డాక్టర్‌ ‌కపూర్‌ ‌పేర్కొన్నారు.

– దండంరాజు. రాంచందర్‌ ‌రావు రిటైర్డ్ ‌డిప్యూటీ సూపరింటెండెంట్‌ ‌సింగరేణిభవన్‌ ‌హైదరాబాద్‌, 9849592958

Leave a Reply