ఆవేదనతో యువత ఆందోళన బాట
డీఎస్సీ 11 వేలకే ఎందుకు పరిమితం..మెగా డిఎస్సీ ఏమైంది
2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఏమైంది
ఆరు గ్యారంటీలతో సహా ఇచ్చిన హావి•లను వెంటనే అమలు చేయాలి
మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం ఆపండి : మాధ్యమాలపై హరీష్ రావు ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేయడంతో యువత ఆందోళన చేస్తుందని, యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లో వి•డియాతో మాట్లాడుతూ.. బేషజాలకు వెళ్లకుండా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హావి• నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రూప్ 1లో వన్ ఈస్ట్ హండ్రెడ్ చొప్పున మెయిన్స్‌కు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హావి• ఇచ్చిందని, అధికారంలోకి వొచ్చాక ఆ మాట ఎందుకు తప్పారని ప్రశ్నించారు. గ్రూప్ టూకు మరో 2 వేలు, గ్రూప్ త్రీకి మరో 3 వేల ఉద్యోగాలు జోడించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరీక్షకు..పరీక్షకు మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలని, అధికారంలోకి వొచ్చి ఆరు నెలలైనా జాబ్ క్యాలండర్ ఎందుకు ఇవ్వలేదని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెగా డీఎస్పీ ఏమైందని నిలదీశారు. డీఎస్సీని 11వేలకే ఎందుకు పరిమితం చేశారన్నారు. వొచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని, కోదండరామ్ కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
కోదండరామ్ బాధ్యత తీసుకుని గౌరవం నిలుపుకోవాలని, విద్యార్థుల పక్షాన ప్రజా పోరాటానికి శ్రీకారం చుడతామని హరీష్ రావు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతి, యువకులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హావి•లను వెంటనే నెరవేర్చాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావి• ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ జాడ పత్తా లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ పోస్టులు పెంచాలని కోరారు, ఇప్పుడు గ్రూప్ విద్యార్థులు పోస్టులు పెంచాలని కోరితే స్పందించడం లేదన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్‌కు అవకాశమివ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తే 1:100 విధానం అమలు చేస్తామని విద్యార్థులకు హావి• ఇచ్చారని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హావి•లు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుతను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు బీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇచ్చారని చెప్పారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వొచ్చి ఆరు నెలలయిందని, ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు. పింఛన్ ఎప్పుడిస్తరని అవ్వతాతలు అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పెన్షన్ వొచ్చేందని అంటున్నారని తెలిపారు. రెండు నెలల నుంచి ఆసరా పింఛన్ రావడం లేదని వెల్లడించారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న పింఛన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరుతో తీసుకున్న ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజాపాలన ఆచరణలో ఏమైందన్నారు. పేదల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. ఏపీ సీఎం మొదటి సంతకంతో పింఛన్ రూ.4 వేలకు పెంచారని, వి•రు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. పక్కన ఆంధప్రదేశ్ ఇచ్చినప్పుడు వి•రెందుకు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వికలాంగులకు రూ.6 వేల పింఛన్ వెంటనే ఇవ్వాలన్నారు. చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ పేషెంట్లకు బీఆర్‌ఎస్ హాయంలో పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చామని చెప్పారు. ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు.
ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు ఇస్తే ఆశా వర్కర్లు ఎందుకు వైద్యవిధాన పరిషత్‌కు వస్తారని ప్రశ్నించారు. ఎన్‌హెచ్‌ఎం కింద 17 వేల మంది పనిచేస్తున్నారని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. వెంటనే గ్రామపంచాయతీయలకు నిధులు విడుదల చేయాలన్నారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై కేసీఆర్ బొమ్మ ఉందని ఇవ్వట్లేదని, 1.5 లక్షల మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నారని, 60 వేల మంది జీతాల కోసం వేచిచూస్తున్నారన్నారు. తమ హయాంలో వారికి జీతాలు ఆపలేదన్నారు.
పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం ఆపండి : మాధ్యమాలపై హరీష్ రావు అసంతృప్తి
తాను పార్టీ మారుతున్నట్లు వొస్తున్న వార్తలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన వి•డియాతో మాట్లాడుతూ..సంచనాల కోసం తనపై వి•డియా, సోషల్ వి•డియాలో, యూట్యూబ్ ఛానల్‌లో ఏవేవో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లోకి, బీజేపీలోకి వెళ్తున్నానని ఏదేదో ప్రచారం చేస్తున్నారని, దయచేసి ఇలాంటి తంబ్ నెయిల్ పెట్టి వారి లైక్స్, వ్యూస్ కోసం నాయకుడి క్రెడిబిలిటి దెబ్బతీయొద్దని సూచించారు. ఏదైనా ఉంటే తనను అడిగి రాయాలని సూచించారు. ఇలాంటివి మానుకోకపోతే వారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.