ఇపుడు ద్వీప దేశం శ్రీలంక
రావణకాష్టమై రగులుతోంది
పౌర సమాజం గడప దాటి
ఆందోళనల బాట పట్టింది
నింగినంటిన నిరసనలు
చెలరేగుతున్న ఘర్షణలు
హింసాత్మక ఘటనలతో
శ్రీలంక అట్టుడుకుతుంది
పాలించే నేతల దుర్నీతి
ఓట్లను కొల్లగొట్టే ఆపతి
పీఠంపై పట్టుబిగించే కుతి
బంధు వర్గంపై ఆశ్రీత ప్రీతి
అహేతుక ఆర్థిక విధానాలే
శ్రీలంక సంక్షోభానికి కారణం
ఇపుడు భారతదేశం కూడా
దాదాపు లంకకు సారుప్యమే
ఎందుకంటే ఇప్పటికీ
అవినీతి చీడ కడతేరలేదు
దోపిడీ పీడ విరగడకాలేదు
నిరుద్యోగ బెడద తప్పలేదు
కులమత కుంపటి ఆరలేదు
ఆధిపత్య పోకడలు వీగలేదు
పాలక తీరుతెన్ను మారలేదు
ఇంకా పెట్రేగుతున్న తరుణం
వీటికి తోడు
పేరుకున్న అప్పుల కుప్పలు
నింగిని తాకిన కనీస ధరలు
ప్రజానీకం పడరాని తిప్పలు
దేశ పతనావస్థకు నిదర్శనం
ముప్పును ముందే పసిగట్టి
అప్రమత్తంగా మెదలకపోతే
మనకూ శ్రీలంక గతి తప్పదు!
– కోడిగూటి తిరుపతి
:9573929493