దేశంలో హింసాత్మక రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దూకుడు రాజకీయాలు పెరిగాయి. తెలంగాణ, ఎపి, బెంగాల్లో గత కొంతకాలంగా పరస్పర దాడులతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ప్రధానంగా బిజెపి ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షలు సృష్టిస్తోంది. అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి పాలనను లక్ష్యంగా చేసుకుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో దాడుల కు కూడా వెనకాడడం లేదు. బెంగాల్లో ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు తృణమూలు దాడులకు తెగించింది. హత్యలకు కూడా వెనకాడలేదు. ఇప్పటికీ బెంగాల్లో హత్యా రాజకీయాలు సాగుతున్నాయి. కర్నాటకలో హిజాబ్ వివాదం తెరపైకి తీసుకుని వచ్చారు. దానిని దేశవ్యాప్తంగా తీసుకుని రావాలని చూశారు. ఇదే పద్దతి ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యింది. విమర్శలతో పాటు దాడుల రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల సమస్యలు పక్కకు పోతున్నాయి. అంతెందుకు మైనార్టీలను బుజ్జగించే ప్రయత్నంలో ప్రతి చర్యను విమర్శిస్తున్నారు.
బండి సంజయ్ యాత్రలో దాడులకు తెగించడం, కాంగ్రెస్ తదితర పార్టీలు ఆందోళనలు చేయకుండా అరెస్టులు చేసి బెదిరించడం వంటి ఘటనలు చూస్తున్నాం. ఇకపోతే శ్రీరామ నవమి వేడుకలు, హనుమజ్జయంతి ఊరేగింపు సందర్భంగా పలు రాష్టాల్ల్రో చోటుచేసుకున్న ఘర్షణలు, రాళ్ల దాడుల ఉద్రిక్తతల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, గుజరాత్‌సహా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రల్లో తలెత్తిన వివాదాలు ముదురుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ పట్టణంలో రామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి మృతిచెందిన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఎస్పీకి సైతం బుల్లెట్ గాయమైంది. కాగా, వివాదం అనంతరం అదృశ్యమైన ఇబ్రేష్ ఖాన్(30) మరుసటి రోజు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌లో బైక్‌ల ప్రమాదం.. వర్గ వివాదంగుజరాత్‌లోని వడోదరలో రావ్‌పురా ప్రాంతంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల బైక్‌లు ఢీకొన్నాయి. అనంతరం సపంలోని కరేలిబాగ్‌లో అల్లర్లు చెలరేగాయి.ఇందులో పాల్గొన్న 19 మందితో పాటు ప్రమాదానికి గురైన బైక్‌లపై ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, గుజరాత్‌లోని వెరావల్ పట్టణంలో హనుమజ్జయంతి ర్యాలీ సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.
మహారాష్ట్ర అచలాపూర్‌లో కర్ఫ్యూమహారాష్ట్రలోని అమరావతి జిల్లా అచలాపూర్‌లో మతపరమైన జెండాలను ఎగురవేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వీటిని తొలగించే అక్రమంలో ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. పట్ణణంలో సోమవారం కర్ఫ్యూ విధించారు. మొత్తం 22 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ఏటా ఈ గేట్‌లపై పండుగల సందర్భంగా వివిధ మతాల జెండాలను ఏర్పాటు చేస్తుంటారని.. ఆదివారం మాత్రం సంఘ వ్యతిరేక శక్తులు వాటిని తొలగించే యత్నం చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. నవమి, హనుమజ్జయంతి సందర్భంగా రాష్టాల్ల్రో చోటుచేసుకున్న మత హింసపై కోర్టు పర్యవేక్షణలో లేదా విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో అల్లర్లపై సుప్రీ మాజీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో విచారణకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిల్ వేశారు.
కేరళ వరుస హత్యల కేసుల్లో కుట్ర కోణంకేరళ పాలక్కడ్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వరుస హత్యల కేసుల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)-సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ), జోక్యం ఉందని పోలీసులు తెలిపారు. ఈ రెండు హత్యల వెనుక కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను అడపదదడపా హత్యలకు గురి చేస్తున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా వాయువ్య ఢిల్లీ జహంగిర్ పురిలో జరిగిన ఘర్షణలపై మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇరు వర్గాలకు చెందిన వారూ ఉన్నారని.. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు. నిందితుల నుంచి ఐదు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తంగా శాంతిని కాపాడాల్సిన పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అ•-ల్లర్లను ప్రేరేపిస్తున్నాయి. పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారనా అన్నది అనుమానమే. నిజానికి అల్లర్లో ఎవరి ప్రమేయం ఉన్నా కఠినంగా శిక్షించాలి. మరోమారు ఇలాంటి అల్లర్లు, దాడులు, హత్యలు జరక్కుడా చర్యలు తీసుకోవాలి.
ఇదిలావుంటే కేంద్రంలోని బిజెపి లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు పోరాడుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి సారించాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ శిబిరంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు వ్యూహరచన చేసే పనిలో పడ్డారు. మరోవైపు బీజేపీ యేతర పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహించాలని శివసేన నిర్ణయించింది. త్వరలో ముంబై లో ఈ భేటీ జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితి పై చర్చించాల్సిన అవసరం ఉందంటూ బెంగాల్ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బీజేపీ అధికారంలోని లేని రాష్టాల్ర సీఎంలకు ఇటీవల లేఖ రాశారు. దీనిపై ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చర్చించారని..
సీఎంల భేటీ ముంబైలో జరిపేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని వెల్లడించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతకల్లో లాల సృష్టికి ప్రయత్నాలు తదితర అంశాలపై ఆ సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పారు. ఆహారం, వస్త్రధారణ, విశ్వాసం, పండుగలు, భాషవంటివాటిని సమాజాన్ని విభజించేందుకు మోదీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని విమర్శిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పవార్, మమత, తమిళ నాడు, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్ తదితర ప్రతిపక్ష నేతలు ఇటీవల ఓ సంయుక్త ప్రకటన విడుదలచేసిన సంగతి తెలిసిందే. కాగా.. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై ఇటీవల జరిగిన దాడులు రాజకీయ ప్రేరితమైనవని రౌత్ ఆరోపించారు.
-ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్