Take a fresh look at your lifestyle.

దిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం

న్యూ దిల్లీ, మార్చి 21 : ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌నేతృత్వంలోని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోమ్‌ ‌వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనా పరిశీలించిన తర్వాత తనకు మళ్లీ సమర్పించాలని అంతకుముందు ఎంహెచ్‌ఏ ‌కోరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ శాసన సభలో బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు బడ్జెట్‌ను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని కేజీవ్రాల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం ఎంహెచ్‌ఏ ‌సోమవారం స్పందిస్తూ, ప్రతిపాదిత బ్జడెట్‌పై దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌కొన్ని పరిపాలనపరమైన అంశాలను లేవనెత్తారని తెలిపింది.
దేశ రాజధాని నగరం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలను లేవనెత్తారని పేర్కొంది. ఈ అంశాలను పరిష్కరించి బడ్జెట్‌ను తిరిగి పంపించాలని మార్చి 17న రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొంది. కేజీవ్రాల్‌ ‌మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో రాష్ట్ర బ్జడెట్‌కు ఆమోదం తెలపకుండా నిలిపివేయవద్దని కోరారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ రాష్ట్ర బ్జడెట్‌కు ఆమోదం తెలపకపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. మా ఢిల్లీ ప్రజలపై కెందుకంత కోపం అని ప్రశ్నించారు. ఈ బ్జడెట్‌ను ఆమోదించాలని దిల్లీ ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారని పేర్కొన్నారు.

Leave a Reply