Take a fresh look at your lifestyle.

దిల్లీలో టిడిపి ఆవిర్భావ వేడుకలు

న్యూ దిల్లీ,మార్చి 29 : టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పాల్గొన్నారు. ఆ వేడుకలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, ‌కేశినేని నాని, కనకమేడల రవీందర్‌ ‌నిర్వహించారు. కేక్‌ ‌కట్‌ ‌చేసి ఇతర పార్టీల ఎంపీలకు టీడీపీ ఎంపీలు అందజేశారు. ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో జేపీ నడ్డా సైతం అక్కడకు చేరుకున్నారు.

టీడీపీ ఎంపీలకు అభినందనలను తెలియజేశారు. వాజ్‌ ‌పేయి, ఎన్‌డీఏ హయాంలో టీడీపీ- బీజేపీల మధ్య అనుబంధాన్ని ఎంపీ కనకమేడల.. నడ్డాకు వివరించారు. అయితే తనకు టీడీపీతో స్నేహ సంబంధాల గురించి తెలుసని నడ్డా పేర్కొన్నారు. ఇటీవల అండమాన్‌ ‌మేయర్‌ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ పొత్తుపైనా నడ్డా ట్వీట్‌ ‌చేసిన విషయం తెలిసిందే. తమ అభ్యర్ధుల విజయంపైనా సైతం ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply