త్వరలోనే బిజెపి అభ్యర్థుల ఎంపిక

28న తెలంగాణకు అమిత్‌ షా
బిజెపి చీఫ్‌ కిషన్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి25: పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని, వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. 28న అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌పై బీజెపి సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మజ్లీస్‌ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను దోపిడీ దొంగల పార్టీలుగా అభివర్ణించిన కిషన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దోషులకు శిక్ష పడుతుందనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతిని కాంగ్రెస్‌ బయటకు తీస్తుందని ఆశిస్తే అది భంగపడ్డట్లే అవుతుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్గిలాంటి పార్టీ. బీజేపీపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచిస్తున్నా. బీఆర్‌ఎస్‌`బీజేపీ ఒకటేనని, కాంగ్రెస్‌?బీజేపీ ఒక్కటేనని మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ పార్లమెంట్‌లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్‌ను ఓడిరచడం కోసమే పనిచేయాలి. హైదరాబాద్‌లో ఉన్న ముస్లిం సోదరులు మజ్లీస్‌ పార్టీని ఓడిరచాలని చూస్తున్నారు. మజ్లీస్‌ పార్టీని వ్యతిరేకించే ప్రతిఒక్కరూ బీజేపీ వైపు రావాలి. లక్షమంది అసదుద్దీన్‌లు వచ్చినా… మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం‘ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

 నేడు బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ
కెసిఆర్‌ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహణ
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25: బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగనుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ఎంపీలతో కేసీఆర్‌ చర్చించనున్నారు. తుంటి ఎముక ఆపరేషన్‌ చేసుకుని కోలుకుంటున్న కెసిఆర్‌ తన ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడే సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో ఆయన ఎంపి పదవికి రాజీనామా చేశారు. దీంతో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు తగ్గింది. ఇవే చివరి సమావేశాలు కావడంతో పాటు, ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *