బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, జూన్ 4 : టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారంపై స్పందించిన ఆయన టీఆర్‌ఎస్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
‘హైదరాబాదులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చాలా ఆందోళనకరం. నగరం నడిబొడ్డునే ఇంతటి దారుణమా? రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. సంపన్న కుటుంబాల నిందితులకు ఒక న్యాయం పేద, నిందితులకు మరో న్యాయం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.