భోపాల్, మార్చి 21 : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీలు, సామాన్యులు సైతం హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ పక్కనే ఉన్నవాళ్లు ఒక్కసారిగా నిర్జీవమైపోతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రధేశ్ లోని భోపాల్ లో జరిగింది.పోస్టల్ డిపార్డ్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్ దీక్షిత్ అనే వ్యక్తి డాన్స్ చేస్తూ మరణించాడు.
బస్ ఆజ్ కి రాత్ హై జిందగీ అనే ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తున్న సురేంద్ర.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు హుటాహుటిన హాస్పిటల్ కి తరలిచారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే, ఈవెంట్లో డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ డియాలో వైరల్ అవుతోంది.