- హైకోర్టులో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కౌంటరు దాఖలు
- వేసవి సెలవుల తరువాత పూర్తి స్థాయిలో విచారిస్తామన్న హైకోర్టు
ప్రజాతంత్ర , హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటరు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీకి 828 పేజీలతో కూడిన వివరాలు ఇచ్చామనీ, కోర్టులకు ఇచ్చిన డిజిటల్ సాక్ష్యాలతో పాటు కెల్విన్ కేసులో సేకరించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఈడీకి అప్పగించామని తెలిపారు. కెల్విన్ కేసులో సిట్ సేకరించిన 12 మంది కాల్ డేటా ఈడీకి ఇచ్చామనీ, 12 మంది విచారణకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు కూడా ఇచ్చామని పేర్కొన్నారు.
హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశ్యం లేదనీ, ఆదేశాల అమలులో కొంత ఆలస్యం జరిగినందుకు బేషరతుగా క్షమాణపణలు చెబుతున్నాయనీ, కోర్టు ధిక్కరణ కేసును కొట్వివేయాలని హైకోర్టను అభ్యర్థించారు. మరోవైపు, తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో వాదనలకు ఈడీ సమయం కోరడంతో పాటు ఎక్పైజ్ శాఖ వివరాలు కోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపింది. అనంతరం ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణను వేసవి సెలువల తరువాత చేపడతామని హైకోర్టు వెల్లడించింది.