టాప్‌లో హరీష్‌ ‌రావు ..!

  • బీజేపీకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి 10 స్థానం
  • రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది..?..పీపుల్స్ ‌పల్స్, ‌సౌత్‌ ‌ఫస్ట్ ‌సంయుక్త సర్వే
  • సర్వే నివేదికలో సంచలన విషయాలు..

తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ ‌పల్స్-‌సౌత్‌ ‌ఫస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌ ‌సంస్థలు సంయుక్తంగా నిర్వహిం చిన సర్వేలో బీఆర్‌ఎస్‌ ‌కు చెందిన సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్‌ ‌రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్‌ఎస్‌ ‌కు  చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ‌చివరి స్థానంలో నిలిచారు. పీపుల్స్ ‌పల్స్ ‌సంస్థ-సౌత్‌ ‌ఫస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌ 28 ‌మార్చి నుంచి 3 ఏప్రిల్‌ ‌వరకు 118 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుంచి 500 సాంపిల్స్ ‌ను కంప్యూరైజ్డ్ అసిస్టెడ్‌ ‌టెలిఫోనిక్‌ ఇం‌టర్వ్యూస్‌ (‌క్యాటీ) / ఐవీఆర్‌ఎస్‌ ‌ద్వారా సేకరించి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పురుషులు, మహిళలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సర్వే కేవలం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే అంశంపై మాత్రమే నిర్వహించారు తప్ప ఆయా నియోజ కవర్గాల్లో ఎవరు గెలుస్తా రు..? ఎవరు ఓడిపోతారు అనే అంశంపై మాత్రం కాదు. ముఖ్య మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ ‌నియోజ కవర్గాన్ని ఈ సర్వేలో మినహాయి ంచబడింది.

ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ ‌పల్స్ ‌సంస్థ- సౌత్‌ ‌ఫస్ట్ ‌వెబ్సైట్‌ ‌నిర్వహించిన సర్వే ప్రకారం 24 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వా లేదని వెల్లడ్కెంది.
రాష్ట్రంలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఏడుగురు పనితీరు బాగుందని, 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వా లేదని సర్వేలో వెల్లడ్కెంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని, బీజేపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఒక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని, నలుగురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని, ఎంఐంఎం ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడ్కెంది. సీపీఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది.

image.png
ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది టాప్‌ ఎమ్మెల్యేలలో బీఆర్‌ఎస్‌ ‌కు   చెందిన హరీష్‌ ‌రావు ప్రథమ స్థానంలో, బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి 10 స్థానంలో ఉన్నారు. టాప్‌ 10 ‌మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు బీఆర్‌ఎస్‌ ‌కు  చెందిన వారు కాగా, ఇద్దరు అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ, ఇద్దరు బీజేపీ, ఒకరు ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. టాప్‌ 10‌లో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్‌ ‌బాబు 3వ స్థానంలో ఉండగా, హుజుర్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా టాప్‌ 10 ఎమ్మెల్యేలలో బీఆర్‌ఎస్‌ ‌తరఫున మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్‌ 2‌వ స్థానంలో, పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ 7‌వ స్థానంలో ఉన్నారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి 5వ స్థానంలో, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి 6వ స్థానంలో ఉన్నారు. టాప్‌ 10‌లో బీజేపీకి చెందిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ 8‌వ స్థానంలో, ఎంఐఎం ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ 4వ స్థానంలో ఉన్నారు.

బిసి సామాజిక వర్గంలో..
బీసీ సామాజిక వర్గానికి సంబంధించి టాప్‌ 10 ఎమ్మెల్యేలలో అధికార పార్టీకి చెందిన వారు నలుగురు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ‌కు  చెందిన వారు ముగ్గురు, బీజేపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. బీసీలకు చెందిన టాప్‌ 10 ఎమ్మెల్యేలలో బీజేపీకి చెందిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ ‌మొదటి స్థానంలో ఉన్నారు.

బీసీ సామాజికవర్గానికి సంబంధించి అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున బీసీ శాఖ మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ 3‌వ స్థానంలో ఉండగా, ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 6వ స్థానంలో, ప్రభుత్వ విప్‌, ‌వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ 8‌వ స్థానంలో, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి 9వ స్థానంలో ఉన్నారు.

బీసీ సామాజికవర్గంలో బీఆర్‌ఎస్‌ ‌చెందిన మాజీ మంత్రి కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ 4‌వ స్థానంలో, మాజీ మంత్రి సనత్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ ‌యాదవ్‌ 5‌వ స్థానంలో, మాజీ డిప్యూటీ స్పీకర్‌, ‌సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి పద్మారావ్‌ 7‌వ స్థానంలో ఉన్నారు.  బీసీ ఎమ్మెల్యేలకు సంబంధించి టాప్‌ 10‌లో బీజీపీకి సంబంధించి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ 2‌వ స్థానంలో, ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పవర్‌ 10‌వ స్థానంలో ఉన్నారు.

ఎస్సీ సామాజిక వర్గంలో..
ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, మధిర ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క మొదటి స్థానంలో ఉన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2వ స్థానంలో, ప్రభుత్వ విప్‌, ‌ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ 3‌వ స్థానంలో, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ 4వ స్థానంలో, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం 5వ స్థానంలో, రాష్ట్ర మంత్రి, ఆందోల్‌ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహా 6వ స్థానంలో, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు 7వ స్థానంలో, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద 8వ స్థానంలో, స్టేషన్‌ ‌ఘన్పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 9వ స్థానంలో, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్‌ ‌రావు 10వ స్థానంలో ఉన్నారు.

ఎస్టీ సామాజిక వర్గంలో..
ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క మొదటి స్థానంలో, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య 2వ స్థానంలో, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 3వ స్థానంలో, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ ‌జాదవ్‌ 4‌వ స్థానంలో, వైరా ఎమ్మెల్యే రాందస్‌ ‌మాలోత్‌ 5‌వ స్థానంలో, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 6వ స్థానంలో, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌ ‌నేనావత్‌ 7‌వ స్థానంలో, ఆసీఫాబాద్‌ ఎమ్మెల్యే కోవాలక్ష్మి 8వ స్థానంలో, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌ 9‌వ స్థానంలో, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 10వ స్థానంలో ఉన్నారు.
మహిళా టాప్‌ ఎమ్మెల్యేలలో బీఆర్‌ఎస్‌ ‌కు  చెందిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో, అధికార కాంగ్రెస్‌ ‌కు  చెందిన మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క రెండో స్థానంలో ఉన్నారు. మరో మహిళా మంత్రి వరంగల్‌ ‌తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 7వ స్థానంలో ఉన్నారు.

మహిళా టాప్‌ ఎమ్మెల్యేలలో కాంగ్రెస్‌ ‌కు  సంబంధించిన వారిలో కోదాద ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 4వ స్థానంలో, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికా రెడ్డి 5వ స్థానంలో, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి 8వ స్థానంలో, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని 9వ స్థానంలో ఉన్నారు.
టాప్‌ ‌మహిళా ఎమ్మెల్యేల్లో బీఆర్‌ఎస్‌ ‌కు సంబంధించి మాజీ మంత్రి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి 3వ స్థానంలో, ఆసీఫాబాద్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మి 6వ స్థానంలో ఉన్నారు.

రాజకీయ పార్టీల పరంగా..
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో టాప్‌ 10‌లో మంత్రి, ముంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు మొదటి స్థానంలో ఉండగా, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ 10‌వ స్థానంలో నిలిచారు. మంత్రి, హుజుర్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి 2వ స్థానంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 3వ స్థానంలో, మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి 4వ స్థానంలో, మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క 5వ స్థానంలో, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు 6వ స్థానంలో, మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ 7‌వ స్థానంలో, మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు 8వ స్థానంలో, మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ ‌రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో టాప్‌ 10‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌ ‌రావు మొదటి స్థానంలో ఉండగా, మాజీ మంత్రి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి 10వ స్థానంలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2‌వ స్థానంలో, మాజీ మంత్రి బాల్కొండ్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ ‌రెడ్డి 3వ స్థానంలో, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి 4వ స్థానంలో, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ 5‌వ స్థానంలో, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ 6‌వ స్థానంలో, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 7వ స్థానంలో, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 8వ స్థానంలో, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు.

బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ ‌మొదటి స్థానంలో, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ ‌బాబు 8వ స్థానంలో ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి 2వ స్థానంలో, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ 3‌వ స్థానంలో, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పవార్‌ 4‌వ స్థానంలో, అర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌ ‌రెడ్డి 5వ స్థానంలో, నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌ ‌రెడ్డి 6వ స్థానంలో, నిజామాబాద్‌ అర్మన్‌ ఎమ్మెల్యే ధనపాల్‌ ‌సూర్యనారాయణ 7వ స్థానంలో ఉన్నారు.

ఎంఐంఎంకి చెందిన 7 మంది ఎమ్మెల్యేలలో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మొదటి స్థానంలో, యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్‌ ‌హుస్సేన్‌ 7‌వ స్థానంలో నిలిచారు. మలక్‌ ‌పేట ఎమ్మెల్యే అహ్మద్బిన్‌ అబ్దుల్లా బలాల 2వ స్థానంలో, చార్మినార్‌ ఎమ్మెల్యే మిర్‌ ‌జుల్ఫీకర్‌ అలీ 3వ స్థానంలో, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్‌ ‌హుస్సేన్‌ 4‌వ స్థానంలో, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ ‌మోహియుద్దీన్‌ 5‌వ స్థానంలో, బహదూర్‌ ‌పురా ఎమ్మెల్యే మహ్మద్‌ ‌ముబీన్‌ 6‌వ స్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page