Take a fresh look at your lifestyle.

జీవనరాగం

జీవితం
నిరాశల నెర్రెలు విచ్చుకొని
సెగలు గక్కే ఎడారిగా మారిపోయి
దుఃఖపు గాడ్పులతో
నిన్ను భయపెడుతున్నా
క్రుంగిపోకు నేస్తం…
నీ కన్నీటి ఆవిర్లు
తొలకరి మేఘాల రాగాలై
వర్షపు ధారల నాదాలై
నీ సంకల్ప స్వరప్రవాహమై
నదిలా వురుకుతుంది…
సడలిపోని
ఆత్మవిశ్వాసపు గలగలలతో
పరుగులు పెడుతుంది…
నీ దారుల్ని
సస్యశ్యామలం చేస్తుంది…
అప్పుడు ఆవిర్భవించే
ఆశల రుతువు
ఛైత్రపు మందహాసమై
మోడువారిన
మనసుచెట్టుపై
ఆశయాల పుష్పాల్ని
వికసింపజేస్తుంది…
జీవనోద్యానం నిండా
రేపటి పచ్చదనాల్ని
విస్తరింపజేస్తుంది…
–  డాక్టర్‌ ‌కొత్వాలు అమరేంద్ర 91777 32414 ),  తిరుపతి (ఆ.ప్ర).

Leave a Reply