జార్జ్ బతుకున్న కాలంలో ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తూ అధ్యయన కేంద్రాలు నిర్వహించేవారు. అభివృద్ధి నిరోధక పాటిస్తూ శక్తులకు వ్యతిరేకంగా జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతూ అమరత్వం చెందాడు. జార్జ్ నేడు సజీవంగా లేడు కానీ తను కలలు కన్న మహోన్నతమైన ఆశయం లక్ష్యం మనందరి ముందుంది.
ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆధిపత్య మతోన్మాద మూకల ఆటకట్టించి ,అడ్డుకట్టేసి సమానత్వ సమాజాన్ని కాక్షించిన పాతికేళ్ల జార్జిరెడ్డి అమరత్వం చెంది నేటికి సరిగ్గా 50 ఏళ్ళు. స్వల్ప కాలం మహోన్నతమైన ఆశయంతో జీవించి మరణించిన జార్జ్ సదా చిరంజీవి.
జార్జిరెడ్డిని స్మరించడమంటే అన్యాయనికి, అరాచకత్వానికి, అసమ సమాజానికి, వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన కర్తవ్యాలను ఆవాహనం చేసుకోవడం.దేశంలో మూఢత్వం, కుల, మత, ప్రాంతీయ వివక్షత, అశాస్త్రీయ, లైంగిక దాడులు, నిరుద్యోగం దినదినాభివృద్ధి చెందుతున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాల్సిన యూనివర్సిటీలోనూ మతతత్వ పార్టీల ప్రభావంతో కుల వివక్ష వెంటాడుతోంది. దాని ఫలితమే రోహిత్ వేముల ఆత్మహత్య.నిజం చెప్పాలంటే అది వ్యవస్థీకృత హత్య. 50ఏళ్ల కిత్రం జార్జ్ ని హత్యచేసిన మతోన్మాదం నేడు అధికారంలో ఉంది.విభిన్న సాంస్కృతులు, సంప్రదాయలు, ఆచారాలు గల లౌకిక దేశంలో మత ప్రాతిపదికన చట్టాలు చేస్తోంది. అందులో భాగంగానే కర్ణాటకలో హిజాబ్ విషయం చేలరేగింది.తినే ఆహారంపై ఆంక్షలు విధిస్తున్నారు, భిన్నిస్తే భౌతికదాడులకు పాల్పడుతున్నారు. శ్రీరామనవమి రోజునే జీచీఖ విద్యార్థులపై మతోన్మాదుల దాడి జరిగింది. క్రమక్రమంగా యూనివర్సిటీలను అగ్రహారాలుగా దిగజార్చే పనిలో అది నిమగ్నం అయ్యింది.
అందుకే రాజ్యాంగ అత్యున్నత పదవిలోనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటివాళ్ళు విద్యను ‘‘కాశాయికరిస్తే తప్పేంటని’’ మాట్లాడుతున్నారు. అదే జరిగితే శివుడు పిలుస్తున్నాడనే మూఢత్వంలో తిరుపతి చెందిన ఓ అమ్మాయి..డంబెల్‌తో కొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న తీరే..ఈ కాశాయి(కసాయి) విద్య. అదే న్యూఎడ్యుకేషన్ పాలసీ.కేంద్ర మంత్రులే అభంశుభం తెలియని అమ్మాయిపై అత్యాచారాలు చేస్తున్నారు. వాళ్లే లైంగికదాడులకు మహిళల వేషధారణనే కారణమని స్త్రీలనే దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
మోడీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్ కంపెనీలకు అమ్ముతున్నారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోయింది. రిజర్వేషన్లు హరించబడుతాయి.ఒక్కమాటలో చెప్పాలంటే కార్పొరేట్ ప్రజాస్వామ్యం అమలవుతుంది. బాధితుడిపైనే రాజద్రోహం కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే ప్రతివాడు అర్బన్ నక్సలైట్ అంటున్నారు. రోజురోజుకి నిత్యవసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి.
కేసీఆర్ పాలన నియంతృత్వ ధోరణులతో కొనసాగుతోంది. పేద,మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చారు.జార్జి బతుకున్న కాలంలో ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తూ అధ్యయన కేంద్రాలు నిర్వహించేవారు. అభివృద్ధి నిరోధక పాటిస్తూ శక్తులకు వ్యతిరేకంగా జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతూ అమరత్వం చెందాడు. జార్జ్ నేడు సజీవంగా లేడు కానీ తను కలలు కన్న మహోన్నతమైన ఆశయం లక్ష్యం మనందరి ముందుంది. జార్జ్ ప్రాసంగీకతను కొనసాగిద్దాం.ఆ ఆశయ సాధనలో ప్రయాణించడమే జార్జ్ కి నిజమైన నివాళి..
జోహర్ జార్జ్ రెడ్డి…
-గడ్డం శ్యామ్
పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాద్యక్షుడు
9908415381