Take a fresh look at your lifestyle.

జాతీయమహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా ఖుష్బూ

న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్‌ ‌జాతీయ మహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. ఖుష్బుతో పాటు మమతా కుమారిల్‌, ‌డెలినా ఖోంగ్‌ ‌డుప్‌ అనే  మరో ఇద్దరు మహిళలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ ‌చేసింది. వీళ్లు మూడు సంవత్సరాల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు. ఖుష్బుకి మెంబర్‌ ‌గా పదవి దక్కడంపై తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై అభినంద నలు తెలిపారు.

ఇది ఆమె పట్టుదల, మహిళలకు హక్కల కోసం చేస్తున్న పోరాటానికి దక్కిన గుర్తింపు అని అన్నారు. మరో వైపు తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ఖష్బు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మోడీ నాయకత్వంలో నారీ శక్తిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి,  పోషించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని అన్నారు. నటి, సినీ నిర్మాత, టెలివిజన్‌ ‌ప్రెజెంటర్‌ అయిన ఖుష్బు మొదట డీఎంకేలో చేరారు.   తర్వాత కాంగ్రెస్‌ ‌లో చేరారు. చివరికి బీజేపీలో చేరి   2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.  డీఎంకే అభ్యర్థి ఎన్‌ ఎజిలన్‌ ‌చేతిలో ఆమె ఓడిపోయారు.

Leave a Reply