జలగల్లా మారిన… కోచింగ్‌ ‌సెంటర్లు

‘‘ఒక బ్యాచ్‌ ‌కి 800 నుండి1000 మందిని కుక్కి వందల కోట్లను ఆర్జిస్తూ, అంతమందికి రెండుమూడు టాయిలేట్స్ ‌మాత్రమే పెడుతున్నారు. గంటల తరబడి, వందలమందికి  క్లాసులు చెప్తూ, కనీస సంఖ్యలో టాయిలేట్స్ ‌లేకపోవడంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం మన దౌర్బాగ్యం.’’

ఎప్పుడెప్పుడ అని కళ్లల్లో వత్తులేసుకోని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనను అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించి నట్లైంది. నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, వ్యతిరేకత పీకే సర్వే వెల్లడించడంతో స్వరాష్ట్రంలో సుదీర్ఘ నిరీక్షణ, పోరాటం తర్వాత ప్రభుత్వం నుంచి 80 వేల పోస్టుల భారీ ప్రకటన వెలువడింది.అందులో ఇప్పటికే 30 వేల పోస్టులకు ఆర్ధికశాఖ ఆమోదం లభించడం,మరిన్ని పోస్టులకు కసరత్తు ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతుండంతో నిరుద్యోగులంతా పట్నం బాట పట్టారు. ఇప్పుడు మిస్‌ అయితే మళ్ళీ ప్రకటన ఎప్పుడో తెలియకపోవడంతో ఇదే ఆఖరి అవకాశంగా నిరుద్యోగులు సాధనకు సిద్ధమవుతున్నారు.సరిగ్గా ఇదే అదునుగా కోచింగ్‌ ‌సెంటర్లు నిరుద్యోగుల పాలిట జలగల్లా మరాయి.ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనను అవి క్యాష్‌ ‌చేసుకుంటున్నాయి.

సాధారణంగా ప్రభుత్వ ఉద్య్గోంకి ప్రీపేరవ్వాలనుకున్నవారు ప్రధానంగా కోచింగ్‌ ‌సెంటర్స్ ‌వైపు చూస్తుంటారు.దీనికి కారణం లేకపోలేదు.ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అన్ని సబ్జెక్టు ల్లో అవగాహన తప్పని సరి.అప్పటి వరకు వారు చదవుకున్న డిగ్రీలో సబ్జెక్టులే కాకుండా అదనంగా ప్రతిఒక్కరూ (అన్ని రకాల డీగ్రి విద్య్ధ్నాల్రు)హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ‌బయోలాజికల్‌ ‌సైన్స్ ,‌మ్యాథ్స్ ‌లాంటి చాలా సబ్జెక్టస్ ‌చదవాల్సి ఉంటుంది.దీనికి సొంత ప్రిపరేషన్‌ ‌కన్నా మెజార్టీ విద్యార్ధులు కోచింగ్‌ ‌వైపు చూస్తుంటారు.అక్కడైతే ఆయా సబ్జెక్ట్ల ను సులువుగా బోధించే అధ్యాపకులు ఉంటారు,కాబట్టి విషయంను త్వరగా అర్ధంచేసుకోవచ్చనే అంచనాలో ఉంటారు.అందుకే ప్రకటన వెలువడిన వెంటనే ఉన్నకాడ్కివూడ్చి అప్పుసప్పుచేసి వేలసంఖ్యలో నిరుద్యోగులు హైదరాబాద్‌ ‌చేరారు.

దీన్ని అవకాశంగా దిల్‌ ‌సుఖ్‌ ‌నగర్‌, అశోక్‌ ‌నగర్‌, ‌క్రాస్‌ ‌రోడ్డులోని గ్రూప్‌1,2, ‌డీఎస్సీ, ఎస్‌ఐ, ‌కానిస్టేబుల్‌ ‌లాంటి ప్రధాన కోచింగ్‌ ‌సెంటర్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.తమ ఇష్టానుసారంగా అన్ని రకాల కోచింగ్‌ ‌సెంటర్స్ 20 ‌నుండి25 శాతం ఫీజులు పెంచేశాయి. ఉదాహరణకు మ్నెన్నటి వరకు కానిస్టేబుల్‌ ‌కోచింగ్‌ 10‌వేలుంటే తాజాగా దాన్ని 15వేలు,18వేలు అయ్యింది.దీంతో నిరుద్యోగులు ఫీజులు చెల్లించలేక తీవ్ర అవస్తలు పడుతున్నారు. ఒకరిద్దరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా రంగారెడ్డి ఘటన మనకంతా తెల్సిందే.పెంచిన ఫీజులకు అనుగుణంగా కనీస వసతులైన పెంచారా..అంటే అదిలేదు.ఎలాంటి ప్రభుత్వ, జీహెచ్‌ఎమ్‌సీ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా కోచింగ్‌ ‌వెలుస్తున్నాయి.

అదే సమయంలో ఒక బ్యాచ్‌ ‌కి 800 నుండి1000 మందిని కుక్కి వందల కోట్లను ఆర్జిస్తూ, అంత మందికి రెండుమూడు టాయిలేట్స్ ‌మాత్రమే పెడుతున్నారు. గంటల తరబడి, వందలమందికి క్లాసులు చెప్తూ, కనీస సంఖ్యలో టాయిలేట్స్ ‌లేకపోవడంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం మన దౌర్బాగ్యం.తక్షణమే అనుమతి, వసతులులేని, దోపిడి కోచింగ్‌ ‌సెంటర్లను మూసివేయ్యాలి. ప్రభుత్వమే అన్ని వసతులతో కూడిన అన్ని రకాల కోచింగ్స్ అం‌దించాలి…..
– గడ్డం శ్యామ్‌
‌పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
తెలంగాణ, 9908415381

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page