Take a fresh look at your lifestyle.

ఛతేశ్వర్‌ ‌పుజారా అరుదైన ఘనత

టీమిండియా నయావాల్‌ ‌ఛతేశ్వర్‌ ‌పుజారా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. పటిష్ట ఆస్ట్రేలియా జట్టు మీద టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. తన సమకాలీకులకు సాధ్యం కాని రీతిలో అందరి కంటే ముందే ఈ మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా పుజారా ఘనత వహించాడు. ఆసీస్‌పై టెస్టుల్లో మెరుగైన రికార్డు కలిగిన భారత స్టార్‌ ‌విరాట్‌ ‌కోహ్లి ఇప్పటి వరకు 1793 పరుగులు చేయగా.. అతడి కంటే పుజారా 219 పరుగులు ముందంజలో నిలిచాడు. రన్‌మెషీన్‌ ‌కోహ్లిని దాటి ఓవరాల్‌గా నాలుగో స్థానం ఆక్రమించాడు. అంతేకాదు..టెస్టుల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గానూ పుజారా రికార్డులకెక్కాడు. మహ్మద్‌ అజారుద్దీన్‌ (33 ఇన్నింగ్స్) ‌తర్వాత రోహిత్‌ ‌శర్మ(36 ఇన్నింగ్స్)‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

ఈ క్రమంలో సచిన్‌ ‌టెండుల్కర్‌(38), ‌వీరేంద్ర సెహ్వాగ్‌(39), ‌విరాట్‌ ‌కోహ్లి(39), రాహుల్‌ ‌ద్రవిడ్‌(41)‌లను పుజారా అధిగమించాడు. అదే విధంగా.. టెస్టుల్లో వరల్డ్ ‌నంబర్‌ 1 ఆ‌స్ట్రేలియా మీద సొంతగడ్డపై 1000 పరుగులు చేసుకున్న బ్యాటర్‌గానూ పుజారా ఘనత సాధించాడు. ఇక బోర్డర్‌- ‌గావస్కర్‌ ‌ట్రోఫీ2023లో ఇప్పటి వరకు పుజారా మూడు టెస్టుల్లో నమోదు చేసిన స్కోర్లు 7,0,31 నాటౌట్‌, 59. ‌బోర్డర్‌- ‌గావస్కర్‌ ‌ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు(ఇప్పటి వరకు) సచిన్‌ ‌టెండుల్కర్‌- 34 ‌మ్యాచ్‌లలో 3262 పరుగులు, వీవీఎస్‌ ‌లక్ష్మణ్‌- 29 ‌మ్యాచ్‌లలో 2434 పరుగులు, రాహుల్‌ ‌ద్రవిడ్‌- 32 ‌మ్యాచ్‌లలో 2143 పరుగులు, ఛతేశ్వర్‌ ‌పుజారా- 24 మ్యాచ్‌లలో 2012 పరుగులు(ఇన్నింగ్స్ ‌కొనసాగుతోంది), విరాట్‌ ‌కోహ్లి- 24 మ్యాచ్‌లలో 1793 పరుగులు. ఇక ఇప్పటి వరకు బోర్డర్‌ ‌గావస్కర్‌ ‌ట్రోఫీలో సచిన్‌, ‌లక్ష్మణ్‌, ‌ద్రవిడ్‌ అత్యుత్తమ స్కోర్లు వరుసగా.. 241 నాటౌట్‌, 281, 233 ‌కాగా.. పుజారా 204, కోహ్లి 169 పరుగులు చేశారు.

Leave a Reply